బాలకృష్ణ అమరావతి పర్యటన వాయిదా అందుకే..?

అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వస్తాడని అంతా అనుకున్నారు. టీడీపీ కూడా ఆ మేరకు ప్రకటన చేసింది. కానీ.. చివరికి ఆయన రానేలేదు.

news18-telugu
Updated: January 17, 2020, 10:02 AM IST
బాలకృష్ణ అమరావతి పర్యటన వాయిదా అందుకే..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వస్తాడని అంతా అనుకున్నారు. టీడీపీ కూడా ఆ మేరకు ప్రకటన చేసింది. కానీ.. చివరికి ఆయన రానేలేదు. బాలయ్య వస్తే తమకు భారీగా మద్దతు లభిస్తుందని ఆశించిన రైతులకు, రాజధాని ప్రజలకు నిరాశే ఎదురైంది. మరి ఆయన ఎందుకు రాలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిన్నటికి సరిగ్గా నెల రోజులైంది రైతులు ఆందోళన చేపట్టి. సింగర్ స్మిత, హీరో నారా రోహిత్, నిర్మాత అశ్వినీదత్ మాత్రమే సినీ ఇండస్ట్రీ నుంచి మద్దతు ఇచ్చారు. బాలయ్య వస్తే.. మరింత మంది సినీ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తుందని, దానివల్ల ఉద్యమం మరింత బలపడుతుందని అనుకున్నారు. కానీ.. చివరి నిమిషంలో ఆయన రాకపోయేసరికి రైతులు నిరాశకు గురయ్యారు.

అయితే.. నిన్నటి పర్యటనను రెండ్రోజుల పాటు వాయిదా వేసుకున్నట్లు సమాచారం. చివరి నిమిషం వరకు వస్తాడని అనుకున్నా.. ఉన్నఫలంగా పర్యటనను వాయిదా వేసుకోవడానికి కారణం ఏంటని కూడా చర్చ మొదలైంది. పర్యటన వాయిదాపై ఎవరికి వారు వ్యాఖ్యలు చేస్తున్నా.. ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాల వల్లే ఆయన రెండ్రోజులు పర్యటనను వాయిదా వేసుకున్నారంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయ కారణాలా? లేక వ్యక్తిగత కారణాలా? లేక సినిమా షూటింగ్స్ వల్ల రాలేకపోయారా? అన్నది తేలాల్సి ఉంది.

అదీకాక.. ముహూర్తాలను ఎక్కువగా నమ్మే బాలకృష్ణ.. నిన్న ఆయనకు నక్షత్ర బలం, ముహూర్త బలం లేనందునే అమరావతిలో పర్యటించలేదని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 18న ముహూర్త బలంతో పాటు, ఆయన తండ్రి వర్ధంతి కూడా ఉన్నందున ఆ రోజు అమరావతిలో పర్యటిస్తే బాగుంటుందని అనుకున్నట్లు పలువురు జోరుగా చర్చించుకుంటున్నారు.

First published: January 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు