బాలకృష్ణ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా... మళ్లీ విజయం సాధిస్తారా...

ఒకవేళ హిందూపురంలో బాలకృష్ణ ఓడిపోతే... టీడీపీ ఆవిర్భావం తరువాత ఇప్పటివరకు ఆ పార్టీ చేజారని కంచుకోటను ఇతర పార్టీకి అప్పగించిన బ్యాడ్ రికార్డ్ బాలయ్య సొంతం అవుతుంది.

news18-telugu
Updated: May 22, 2019, 7:39 PM IST
బాలకృష్ణ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా... మళ్లీ విజయం సాధిస్తారా...
నందమూరి బాలకృష్ణ(ఫైల్ ఫోటో)
  • Share this:
మరికొద్ది గంటల్లో లోక్ సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీలోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా రానున్నాయి. ఏపీలో టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తుందా రాదా అనే ఉత్కంఠతో పాటు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి ఎమ్మెల్యేగా గెలుస్తారా లేదా అనే అంశంపై కూడా టీడీపీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఒకవేళ హిందూపురంలో బాలకృష్ణ ఓడిపోతే... టీడీపీ ఆవిర్భావం తరువాత ఇప్పటివరకు ఆ పార్టీ చేజారని కంచుకోటను ఇతర పార్టీకి అప్పగించిన బ్యాడ్ రికార్డ్ బాలయ్య సొంతం అవుతుంది. ఈ నేపథ్యంలో హిందూపురం ఫలితం ఏ విధంగా ఉంటుందనే అంశంపై టీడీపీ శ్రేణులతో పాటు బాలకృష్ణ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రతి విషయంలో సెంటిమెంట్లను ఫాలో అయ్యే హీరో బాలకృష్ణ... ఫలితాలు వెలువడబోయే మే 23న కూడా ఓ సెంటిమెంట్‌ను ఫాలో కాబోతున్నారని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ... కౌంటింగ్ సమయంలో ఆర్డీటీ స్టేడియంలో బస చేశారు. ఇప్పుడు కూడా ఆయన అక్కడే బస చేయనున్నారు. అంతేకాదు గత ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆయన రూమ్ నంబర్ 9లో ఉన్నారని... అందుకే ఈసారి కూడా అదే రూమ్‌లో బస చేయాలని బాలయ్య నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి టీడీపీ కార్యకర్తలు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికల ఫలితాల రోజు కూడా సెంటిమెంట్‌ను నమ్ముకుంటున్న బాలకృష్ణను విజయం వరిస్తుందో లేదో తెలియాలంటే మరికొద్ది గంటల్లో ఆగాల్సిందే.

First published: May 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు