Home /News /politics /

BALAKOT STRATEGIST SAMANT GOEL IS NEW RAW CHIEF KASHMIR EXPERT ARVIND KUMAR IB DIRECTOR SB

రా చీఫ్‌గా బాలకోట్ వ్యూహకర్త సామంత్... ఐబీ చీఫ్‌గా అరవింద్ కుమార్

రా కొత్త చీఫ్‌గా సామంత్ గోయెల్

రా కొత్త చీఫ్‌గా సామంత్ గోయెల్

1990లో పంజాబ్‌లో చెలరేగిన తీవ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొన్న వ్యక్తిగా సామంత్‌ మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలపైనా ఈయనకు మంచి అవగాహన ఉంది.

    కీలక భద్రతా విభాగాలకు కేంద్రం చీఫ్‌లను నియమించింది. రా(రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) చీఫ్‌గా సామంత్ గోయెల్‌ను నిమయిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. రా విదేశీ నిఘా వ్యవహారాలను పర్యవేక్షించే కీలక విభాగం. అలాగే ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ)కి అరవింద్‌ కుమార్‌ని డైరెక్టర్‌గా నియమించారు. వీరిద్దరూ కూడా 1984 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన అధికారులు. గోయెల్‌ పంజాబ్‌ కేడర్‌కు చెందినవారు కాగా.. అరవింద్‌ కుమార్‌ అసొం-మేఘాలయ కేడర్‌లో పనిచేశారు.

    ఇప్పటివరకు సామంత్‌ గోయెల్‌ నిఘా వర్గాల ఆపరేషన్స్‌ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఫిబ్రవరిలో బాలాకోట్‌పై వైమానిక దాడులు, 2016 మెరుపు దాడుల వ్యూహ రచనలో సామంత్ కీలకంగా వ్యవహరించారు. 1990లో పంజాబ్‌లో చెలరేగిన తీవ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొన్న వ్యక్తిగా సామంత్‌ మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలపైనా ఈయనకు మంచి అవగాహన ఉంది. దీంతో సావంత్‌ను కీలకమైన రా విభాగానికి చీఫ్‌గా నియమించింది కేంద్రం. ఇక ఐబీ చీఫ్‌గా ఎన్నికైన అరవింద్‌ కుమార్‌ వామపక్ష తీవ్రవాదాన్ని నిరోధించడంలో కీలకంగా పనిచేశారు. ప్రస్తుతం ఈయన ఐబీ కశ్మీర్‌ విభాగంలో ప్రత్యేక సంచాలకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జమ్ముకాశ్మీర్ లోయలో ఉగ్రవాద నిర్మూలన కోసం చేపడుతున్న కార్యక్రమంలో కూడా అరవింద్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయనను ఐబీ చీఫ్‌గా నియమిస్తూ కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Balakot air strike, Jammu and Kashmir, Pm modi, Pulwama Terror Attack

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు