Home /News /politics /

BAHUJANA RAJYADHIKARA YATRA BSP TELANGANA CHIEF RS PRAVEEN KUMAR KICKSTART 300 DAY YATRA FROM KHILASHAPUR TODAY MKS

RS Praveen kumar: ముందస్తుకు BSP వ్యూహం.. బహుజన రాజ్యాధికార యాత్ర షురూ.. 300రోజులపాటు

బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి నడుమ బహుజన రాజ్య స్థాపనే ధ్యేయంగా బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ‘బహుజన రాజ్యాధికార యాత్ర’ చేపట్టారు. 300 రోజులపాటు సాగనున్న ఈ యాత్ర నేడు ఖిలాషాపూర్ లో ప్రారంభం..

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తప్పవనే అంచనాల నడుమ అన్ని పార్టీలూ తమదైన వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. 85శాతానికిపైగా బహుజనులుండే తెలంగాణలో బహుజన రాజ్య స్థాపనే ధ్యేయంగా బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన యాత్రకు సిద్ధమయ్యారు. బహుజనులకు ఏళ్ల తరబడి జరుగుతున్న అన్యాయాన్ని చాటి చెప్పేందుకు బహుజన సమాజ్‌ పార్టీ తెలంగాణ విభాగం బహుజన రాజ్యాధికార యాత్రకు శ్రీకా రం చుట్టింది. 300 రోజుల పాటు సుదీర్ఘంగా బహుజన రాజ్యాధికార యాత్ర చేపడుతున్నట్టు బీఎస్పీ తెలంగాణ చీఫ్‌ కో–ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

టీబీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తలపెట్టిన 300 రోజుల బహుజన రాజ్యాధికార యాత్ర నేడు అట్టహాసంగా ప్రారంభంకానుంది. ఆదివారం సాయంత్రం 4గంటలకు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌ నుంచి యాత్ర ప్రారంభం కానుందని, అక్కడే ప్రారంభ సభ నిర్వహించనున్నట్టు నేతలు తెలిపారు. బడుగుల రాజకీయ అధికారం కోసం మూడు శతాబ్దాల క్రితం మొఘల్‌ చక్రవర్తులకు వ్యతిరేకంగా పోరాడిన బహుజన యోధుడు సర్ధార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ స్ఫూర్తితో ఈ యాత్రను ప్రారంభిస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.

బహుజన యాత్ర కోసం బీఎస్పీ రూపొందించిన ప్రచార చిత్రం

Telangana Govt Jobs: బీసీలకు 10ఏళ్ల సడలింపు.. CM KCR శుభవార్త.. దివ్యాంగులకు కూడా..


తెలంగాణలో బాహుజనులను ఏకం చేసి, జనాభా ప్రాతిపదికన ప్రజలకు రావాల్సిన వాటా దక్కించుకోవాల్సిందేనని, వందల ఏండ్ల నుంచి ఆధిపత్య వర్గాల దోపిడీని ప్రజలకు తెలిసేలా ఈ యాత్ర ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలనూ యాత్రలో కలుస్తానని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకుంటానని, బహుజన రాజ్యంలో ప్రతి సమస్యను తీరుస్తామని ఆయన హామీ ఇస్తున్నారు.

Shocking: పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతి.. అదే పిల్లి కుక్క కాటుకు బలి.. చివరికి కుక్క కూడా!


నిజానికి జనవరి 15న బీఎస్పీ చీఫ్ మాయావతి జన్మదినం రోజునే బహుజన రాజ్యాధికార యాత్ర ప్రారంభించాలని ప్రవీణ్ కుమార్ నిర్ణయించినా కరోనా కారణంగా వాయిదా వేశారు. కాగా, గతంలో మాదిరిగానే సీఎం కేసీఆర్ ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళతారని, 2022 నవంబర్-డిసెంబర్ లో గుజరాత్ ఎన్నికలతో కలిపి తెలంగాణ ఎన్నికలు ఉండేలా ప్రణాళికలు సిద్దం చేశారనే ఊహాగానాల నడుమ అన్ని పార్టీలూ ఎన్నికల సన్నద్దత మొదలుపెట్టాయి. తెలంగాణ బీఎస్పీలో కీలకంగా ఉన్న ప్రవీణ్ కుమార్ పాదయాత్రలోనే ప్రచారం ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Published by:Madhu Kota
First published:

Tags: Bsp, Rs praveen kumar, Telangana, Yatra

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు