Badvel By pole: బద్వేల్ ఎన్నికలో వార్ వన్ సైడేనా..? జాతీయ పార్టీల పరిస్థితి ఏంటి

బద్వేల్ బై పోల్ గెలుపు ఎవరిది?

Badvel by pole: బద్వేల్ బై పోల్ లో అధికార వైసీపీ కేవలం మెజార్టీపైనే లెక్కలు వేసుకుంటోంది. గెలుపు తమదే అనే కాన్ఫిడెన్స్ తో ఉంది. అయితే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు మాత్రం.. వైసీపీ సవాల్ విసిరే సత్త తమకు ఉంది అంటున్నాయి. కానీ గత చరిత్ర చూస్తే.. కనీసం పోటీ ఇస్తాయా అని రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

 • Share this:
  Badvel By pole:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఉప ఎన్నిక హీటు పెంచుతోంది. అయితే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ (TDP), ఓట్ల పరంగా కాస్త మెరుగ్గా కనిపించే జనసేన  (Janasena)రెండూ ఈ ఉప ఎన్నిక నుంచి తప్పుకున్నాయి. దీంతో వార్ వన్ సైడ్ అవుతుందని.. ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది అనుకన్నారు. కానీ  రెండు జాతీయ పార్టీలు బద్వేల్ ఉప ఎన్నిక బరిలో నిలిచాయి. కేవలం బరిలో దిగడమే కాదు.. గెలుపు తమదే అని తొడలు కొడుతూ... అధికార వైసీపీ (YCP) వైపు కాలు దువ్వుతున్నాయి. ఎలాగైనా ఈ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ఓట్లను కొల్లగొట్టి తమ సత్త చాటాలని బిజెపీ(BJP)., కాంగ్రెస్ (Congress)  తహతహలాడుతున్నాయి. దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణం తరువాత బద్వేల్ ఎమ్మెల్యే  ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.. అధికార వైసీపీ పార్టీ వెంటకసుబ్బయ్య సతీమణికే ఎమ్మెల్యే టిక్కెట్ ను కేటాయించింది. దింతో టీడీపీ., జనసేన పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నాయి. ఇక మిత్ర పక్షం తప్పుకోగా... బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధం అయింది. దింతో పోటీ చేయకున్నా జనసేన తన మద్దతును బిజెపికి ఇస్తామంటూ ప్రకటించింది. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో పూర్తిగా చతికిలబడ్డ కాంగ్రెస్.. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగింది. ప్రధాన ప్రతిపక్షాలు సానుభూతి, సాంప్రదాయం అంటూ పోటీ నుంచి వైదొలగితే..  బీజేపీ- కాంగ్రెస్ పార్టీలు మాత్రం కయ్యానికి సై అంటూ.. మీసం మెలేస్తున్నాయి. బద్వేల్ లో ఇరు పార్టీలకు ఏమైనా ఓటు బ్యాంకు బలంగా ఉందా అంటే అసలే లేదు. 2019లో ఇక్కడ పోటీకి దిగిన కాంగ్రెస్ కు పట్టుమని 2 వేల ఓట్లు కూడా పడలేదు. మరో జాతీయ పార్టీ బిజెపికి 3 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక జనసేనకు 4 వేల పైచిలుకు ఓట్లు రాగా.... టీడీపీకి మాత్రం 76 వేల 603వందల ఓట్లు వచ్చాయి. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే నోటాకు అధికంగా ఓట్లు రావడం విశేషం

  ఇలా ఏ విధంగా లెక్కలు చూసినా..  కాంగ్రెస్., బిజెపి రెండు పార్టీలకు మొత్తం మీద 8 వేల ఓట్లకు మించి రాదని విశ్లేషకులు అభిప్రాయం వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు పోటీ పడాల్సింది రాష్ట్రంలో అధికార వైసీపీ పార్టీతోనే. ఇప్పటికే ప్రభుత్వ పథకాలకు లక్ష కోట్లకు పైగా ప్రజలకు అందించేసింది అధికార పక్షం. ఇక 30 లక్షల మందికి ఇల్లు., ఇళ్ల స్థలాలు ఇచ్చేసింది. మొన్నటికి మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ పార్టీ జోరును తట్టుకోవడం జాతీయ పార్టీలకు సాధ్యమేనా..

  ఇదీ చదవండి: ఘనంగా శ్రీవారి స్నప‌న తిరుమంజ‌నం వేడుక‌.. ముత్యపు పందిరి వాహనంపై బకాసురవధ అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి

  ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన బరిలో లేవు. వైసీపీని వ్యతిరేకించే ఈ రెండు పార్టీల ఓట్లలో కొన్నైనా పోల్ అవుతాయని జాతీయ పార్టీలు అంచనాలు వేస్తున్నాయట. టీడీపీ, జనసేన కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లపై ఆశలు పెట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్‌లు తమకే ఎక్కువ ఓట్లు పడతాయంటే తమకే పడతాయనే లెక్కలు వేసుకుంటున్నాయి.

  ఇదీ చదవండి: ఏపీలో భారీగా తగ్గిన కేసులు.. కరోనా ఫ్రీ దిశగా మూడు జిల్లాలు.. కొత్తగా ఎన్ని కేసులంటే..? స్వామి

  బయటకు ఎన్ని చెప్పుకున్నా.. రెండో ప్లేస్ కోసమే ఈ రెండు పార్టీల పోటీ అన్నది ప్రతి ఓటరుకు తెలిసిందే.. అయితే బీజీపీ మాత్రం టీడీపీ, జనసేన ఓట్లపై భారీగానే ఆశలు పెట్టుకుంది. మరి ఆ పార్టీల కార్యకర్తలు, సానుభూతి పరులు ఎలా వ్యవహరిస్తారో చూడాలి.
  Published by:Nagesh Paina
  First published: