హోమ్ /వార్తలు /National రాజకీయం /

Breaking News: జగన్ పులివెందుల రికార్డును బద్వేల్ లో బద్దలు కొట్టిన దాసరి సుధ.. మెజార్టీ ఎంతంటే?

Breaking News: జగన్ పులివెందుల రికార్డును బద్వేల్ లో బద్దలు కొట్టిన దాసరి సుధ.. మెజార్టీ ఎంతంటే?

జగన్ రికార్డు బ్రేక్ చేసిన సుధ

జగన్ రికార్డు బ్రేక్ చేసిన సుధ

Badvel By Election Results: బద్వేల్ బై పోల్ లో వైసీపీ పెద్దలే ఊహించని ఫలితం వచ్చింది. గత మెజార్టీ చేరుకుంటే చాలు అని వైసీపీ నేతలు చెబుతూ వచ్చారు.. కానీ ఇవాళ ఫలితం చూస్తే.. అధినేత సీఎం జగన్ రికార్డును బద్దలు చేశారు వైసీపీ అభ్యర్థి దా సరి సుధ.. ఆమెకు వచ్చిన మెజార్గీ ఎంతో తెలుసా.?

ఇంకా చదవండి ...

ycp Big Victory in Badvel By Election: బద్వేల్ ఉప ఎన్నిక (Badvel By poll)లో వార్ వన్ సైడ్ అయ్యింది. ఫ్యాన్ గాలి ముందు కమలం వాడింది.. చేయి విరిగింది. మెజార్టీ భారీగా తగ్గిస్తామని జాతీయ పార్టీలైన బీజేపీ  (BJP), కాంగ్రెస్  (Congress) పదే పేద చెబుతూ వచ్చాయి. కానీ ఫలితాలు మాత్రం రివర్స్ లో వచ్చాయి.. వైసీపీ (YCP) పెద్దలు కూడా ఊహించని మెజార్టీ సొంతం చేసుకున్నారు బద్వేల్ వైసీపీ అభ్యర్థి దాసరి సుధ (Dasari Sudha).. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు.. సుధ ఘన విజయం సాధించారు. అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇప్పటి వరకు అందిన ఫలితాల బట్టి 90,228 వేల భారీ మెజార్టీతో వైసీపీ  అభ్యర్ది డాక్టర్ సుధ గెలుపొందారు. దీంతో 2019 ఎన్నికల కంటే రెట్టింపు మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకునట్టైంది వైసీపీ. కేవలం బద్వేల్ లో రెట్టింపు మెజార్టీ మాత్రమే కాదు.. అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి  (CM Jagan Mohan Reddy) రికార్డును కూడా సుధ క్రాస్ చేశారు..

2019 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల (Pulivenula) నుంచి వైఎస్ జగన్ కి 90,110 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. అదే అప్పట్లో ఘన విజయం.. కానీ ప్రస్తుతం సుధా.. ఆ మెజార్టీని క్రాస్ చేసి.. అధినేతకు షాక్ ఇచ్చారు.. కౌంటింగ్ ప్రారంభమైన తొలి రౌండ్ నుంచి ప్రతి రౌండ్ లో భారీ అధిక్యాన్ని సాధించిన వైసిపి... వైసిపికి ఏ దశలోను  బీజేపీ , కాంగ్రెస్ లు పోటీ ఇవ్వలేకపోయాయి.  గత ఎన్నికలతో పోలిస్తే  కాంగ్రెస్ కంటే బీజేపీ మెరుగైన ఓట్లు సాధించింది.  నోటాకు సైతం వేలల్లొ ఓట్లు వచ్చాయి... కాంగ్రెస్ ఆభ్యర్దికి 6205 ఓట్లు రాగా.., బిజేపికి 21621 ఓట్లు పడ్డాయి. ఇక నోటాకు 3635 ఓట్లు వచ్చాయి..

ఇదీ చదవండి : ఏపీ టీడీపీలో ముదురుతున్న వార్.. అచ్చెన్న వర్సెస్‌ కళా వెంకట్రావు..! పై చేయి ఎవరిది..?

అయితే వైసీపీ నేతలు ఈ విజయాన్ని ప్రజా విజయంగా చెబుతున్నారు. ఎందుకంటే టీడీపీ, జనసేనలు నేరుగా పోటీలో లేనట్టు చెప్పినా.. బీజేపీకి ఆ రెండు పార్టీలు మద్దతు పలికాయని వారు ఆరోపిస్తున్నారు. బీజేపీ-జనసేన-టీడీపీ మూడు పార్టీలు కలిసినా.. ఈ ఎన్నికలో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయని గుర్తు చేస్తున్నారు..

ఇదీ చదవండి : ఇన్నిరోజులు గుడ్డి గాడిద పళ్లు తోమారా? పవన్‌ పై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

కేవలం సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలే తమ పార్టీని గెలుపిస్తున్నాయి అన్నారు. కేవలం బద్వేల్ ఎన్నిక అనే కాదు. 2019 ఎన్నికల తరువాత ఏ ఒక్క ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలు ప్రభావం చూపించలేకపోయాయని.. వారు చేస్తున్న ఆరోపణలను సైతం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేవని చెబుతున్నారు..

ఇదీ చదవండి : పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన కమెడియన్.. పోటీ చేసేది ఎక్కడ నుంచి అంటే..?

సీఎం జగన్ కు జనాధారణ పెరిగింది అనడానికి.. ఈ ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనమని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు బుద్ధి మారాలని.. సీఎం జగన్ పై అసత్య ఆరోపణలు చేయడం మనేయాలని వైసీపీ నేతలు సూచిస్తున్నారు..

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ycp

ఉత్తమ కథలు