BADVEL BY POLL RESULT UPDATE YCP CANDIDATE SUDHA WIN AFTER POSTAL BALLET AND FIRST ROUND NGS TPT
Badvel By-Poll Result: బద్వేల్ బై పోల్ ఫలితాల్లో వైసీపీ దూకుడు.. పోస్టల్ బ్యాలెట్, తొలి రౌండ్ లో ఆధిక్యం
బద్వేల్ లో వైసీపీ దూకుడు
Badvel by poll result update: బద్వేల్ బై పోల్ ఫలితాల్లో అధికార వైసీపీ దూకుడుగా దూసుకుపోతోంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ తో పాటు.. తొలి రౌండ్ లో స్సష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. మధ్యాహ్నం 12 గంటలలోపే తుది ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Badvel By-Poll Counting: బద్వేల్ బై పోల్ కౌంటింగ్ లో అధికార వైసీపి (ycp) దూకుడు కనిపిస్తోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచే ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధా అధిక్యంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లో స్పష్టమైన ఆధిక్యం రాగా.. తొలి రౌండ్ లోనూ 8,790 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ప్రతి రౌండ్ లోనే మెజార్టీ మరింత పెరుగుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మధ్యాహ్నం 12 గంటల్లోపై తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తం బరిలో 15 మంది అభ్యర్దులు ఉండగా.. ఎన్నికలో 68.37 శాతం ఓటింగ్ నమోదైంది. అధికార వైసిపి అభ్యర్దిగా డాక్టర్ సుధా (Dr. Sudha), కాంగ్రెస్ అభ్యర్దిగా కమలమ్మ (Kamalamma), బిజేపి అభ్యర్దిగా పనతల సురేష్ (Panathala suresh) ప్రధానంగా పోటీ పడ్డారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య (Venkata Subbaiah) 44,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress), బిజేపీ (BJP)లకు కనీసం డిపాజిట్ దక్కలేదు. కానీ ఈ సారి మంచి ఫలితాలు వస్తాయని ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి...
మరోవైపు అధికార పార్టీ మాత్రం గతం కంటే మెరుగైన ఫలితం వస్తుంది అంటున్నారు. సంక్షేమ పథకాలకు ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ (YSRCP) సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణించడంతో కడప జిల్లా (Kadapa Dist.) బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఆవశ్యకత ఏర్పడింది. అధికార పక్షం.. ఆనవాయితీ సెంటిమెంట్ ప్రకారం వైసీపీ బద్వేలు టికెట్ ను డాక్టర్ వెంకటసుబ్బయ్య అర్ధాంగి డాక్టర్ దాసరి సుధకు ఇచ్చింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం (Telugu Desham) ఈ ఎన్నికలో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. తొలుత పాల్గొనాలని భావించినా సెంటిమెంట్, ఆనవాయితీని పాటించాలని నిర్ణయం తీసుకొంది. అంతే కాకండా గత ఎన్నికల్లో ఎక్కువగా ప్రభావం చూపుకున్నా.. ప్రతిపక్షంలా ప్రశ్నిస్తామంటూ నిరంతం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్న జనసేన కూడా పోటీ నుంచి తప్పుకొంది. అయితే ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పోటీ చేశాయి.
అధికర పార్టీదే హవా..
2019లో వైసీపీ అభ్యర్థి వెంకట సుబ్బయ్యకి 44,734 ఓట్ల మెజారిటీ వచ్చింది. గత ఎన్నికల్లో డిపాజిట్లు దక్కించుకోలేకపోయిన బీజేపీ ఈసారి ప్రభావం చూపగలమని ఆశిస్తోంది. టీడీపీ, జనసేన ఓటు బ్యాంక్ తమవైపు మళ్లుతుందని ఆశతో ఉంది. అటు కాంగ్రెస్ కూడా ఓట్లను పెంచుకోవడం ద్వారా ఉనికిని చాటుకోవాలని చూస్తోంది. ఎటు చూసినా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అందరూ అంచనా వేస్తున్నారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.