Home /News /politics /

BADVEL BY POLL RESULT UPDATE YCP CANDIDATE DR SUDHA BIG VICTORY MORE THAN 90000 VOTES NGS TPT

Badvel By Election Results: బద్వేల్‌లో వైఎస్సార్‌సీపీ భారీ విజయం.. 90 వేలు దాటిన ఆధిక్యం..

బద్వేల్ లో వైసీపీ ఘన విజయం

బద్వేల్ లో వైసీపీ ఘన విజయం

Badvel By Election Results: బద్వేల్‌ బై పోల్ లో అధికార వైసీపీ ఘన విజయం సాధించింది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా 90 వేలకు పైగా ఆధిక్యం సాధించారు. చివరి రౌండ్ ఫలితం ఇంకా రావాల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్య కారణంగా కాసేపు కౌంటింగ్ నిలిచింది.. ఆ ఫలితం కూడా వెలువడితో సుధా సరికొత్త రికార్డు సాధించిన జాబితాలో నిలుస్తారు.

ఇంకా చదవండి ...
    ycp Big Victory in Badvel By Election:  బద్వేల్ బై పోల్ లో అధికార వైసీపీ అభ్యర్థి డా. సుధ (Dr Sudha) సరికొత్త రికార్డు సాధించే దిశగా దూసుకెళ్తున్నారు.   అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)కి గతంలో వచ్చిన మెజార్టీని కూడా క్రాస్ చేసే అవకాశం కనిపిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ కి 90,110 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఆ రికార్డును సుధ బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 11 రౌండ్ల ఫలితం వెలువడింది. 11వ రౌండ్లో మొత్తం ఓట్లు 6688 ఉంటే.. వైసీపీ (YCP)కి 5139 ఓట్లు, బీజేపీ (BJP) 984 ఓట్లు,  కాంగ్రెస్ (Congress) 223 ఓట్లు వచ్చాయి. దీంతో ఓవరాల్ గా 11వ రౌండ్ ఫలితం ముగిసే సరికి వైఎస్సార్‌సీపీ (YSRCP) 90,089 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు అన్ని రౌండ్లలో కలిపి వైఎస్సార్‌సీపీ 1,11,227 ఓట్లు సాధించగా.. బీజేపీ 21,577, కాంగ్రెస్‌ 6223 ఓట్లు సాధించింది. అధికారికంగా మరో రౌండ్‌ ఫలితం వెలువడాల్సి వుంది.

    ఈవీఎంలో సమస్య కారణంగా కాసేపు కౌంటింగ్ నిలిచిపోయినట్టు తెలుస్తోంది. అధికారికంగా ఇంకా గెలుపు ప్రకటించనప్పటికీ.. ఇప్పటి వరకు వెలువడిన ఫలితం ప్రకారం.. అధికార వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా.. 90 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారని తెలుస్తోంది. అయితే చివరి రౌండ్ ఫలితం అధికారికంగా ప్రకటిస్తే.. సీఎం జగన్ రికార్డును బ్రేక్ చేసి  చరిత్రలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. అయితే అధికారికంగా ఫలితం వెలువడిన తరువాతే దీనిపై క్లారిటీ వస్తుంది.

    ఇదీ చదవండి: ఇన్నిరోజులు గుడ్డి గాడిద పళ్లు తోమారా? పవన్‌ పై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఈ ఉప ఎన్నికపై అధికార వైసీపీ మొదటి నుంచి ధీమాగానే ఉంది. కానీ గత మెజార్టీ వస్తుందా రాదా అని కొందరి నేతల్లో టెన్షన్ కనిపించింది. కానీ ఫలితం పూర్తిగా వన్ సైడ్ అయ్యింది. ఇప్పటికే గత మెజార్టీని సైతం డాక్టర్ సుధా క్రాస్ చేయడం విశేషం.. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేకత.. టీడీపీ, జనసేన ఓట్లు తమకు కలిసి వస్తాయని బీజేపీ పదే పదే చెబుతూ వచ్చింది. కానీ ఎక్కడా అలాంటి పరిస్థితి కనిపించలేదు. కనీసం పోటీ ఇవ్వలేపోయాయి జాతీయ పార్టీలు రెండూ.. ఏ రౌండ్ లోనూ ఇటు బీజేపీ కానీ, అటు కాంగ్రెస్ కాని పుంజుకున్నట్టు కనిపించలేదు. ఏదో నామమాత్రపు పోటీనే ఇచ్చాయి, మొత్తం 11 రౌండ్ల ఫలితం ముగిసినా..  వైసీపీ అభ్యర్థికి వస్తున్న ఓట్లలో పావు శాతం ఓట్లు కూడా దక్కించుకోలేకపోతున్నాయి. ఇప్పటి వరకు వెలువడ్డ రౌండ్ల ఫలితాలు చూస్తే.. అధికార వైసీపీ వార్ వన్ సైడ్ చేసిందని చెప్పొచ్చు.. ఇప్పటికి వెలువడిన ప్రతి రౌండ్ లోనూ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా ఆధిక్యం వేలల్లోనే ఉంటోంది. ఏదీ ఏమైనా 2019 ఎన్నికల కంటే రెట్టింపు మెజార్టీతో విజయాన్ని వైసీపీ కైవసం చేసుకుంది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Kadapa, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు