హోమ్ /వార్తలు /National రాజకీయం /

Badvel By Election Results: బద్వేల్ లో వైసీపీ హవా.. ఐదో రౌండ్ కే 50 వేలు దాటిన ఆధిక్యం..

Badvel By Election Results: బద్వేల్ లో వైసీపీ హవా.. ఐదో రౌండ్ కే 50 వేలు దాటిన ఆధిక్యం..

బద్వేల్ భారీ విజయం దిశగా వైసీపీ

బద్వేల్ భారీ విజయం దిశగా వైసీపీ

Badvel By Poll Result Counting Live Updates: బద్వేల్‌ బై పోల్ లో అధికార వైసీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి రౌండ్ కు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా ఆధిక్యం పెరుగుతూ వస్తోంది. మొత్తం 12 రౌండ్లలో ఫలితం రావాల్సి ఉండగా.. ఐదు రౌండ్లు ముగిసే సరికి ఆమెకు 52 వేల కు పైగా ఆధిక్యం ఉంది. మిగిలిన రౌండ్లలో ఇదే ట్రెండ్ కొనసాగితే లక్షకు పైగా మెజార్టీ వచ్చే అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...

Badvel By Election Result 2021 Update:  ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh )సీఎం జగన్ మోహన్ రెడ్డి  (CM Jagan Mohan Reddy) సొంతం జిల్లా కడపలోని బద్వేల్ నియోజకవర్గం బై పోల్ ఫలితాల్లో సత్తా చాటుతామని తొడలు కొట్టిన జాతీయ పార్టీలు అసలు రేస్ లోనే నిలబడినట్టు కనిపించడం లేదు. ఏ రౌండ్ లోనూ ఇటు బీజేపీ (BJP) కానీ, అటు కాంగ్రెస్ (Congress) కాని పుంజుకున్నట్టు కనిపించలేదు. ఏదో నామమాత్రపు పోటీనే కనిపిస్తోంది. మొత్తం ఐదు రౌండ్ల ఫలితం ముగిసినా.. వైసీపీ (YCP) అభ్యర్థికి వస్తున్న ఓట్లలో సగం కూడా దక్కించుకోలేకపోతున్నాయి. ఇప్పటి వరకు వెలువడ్డ రౌండ్ల ఫలితాలు చూస్తే.. అధికార వైసీపీ వార్ వన్ సైడ్ చేసిందని చెప్పొచ్చు.. ఇప్పటికి వెలువడిన ప్రతి రౌండ్ లోనూ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా ఆధిక్యం వేలల్లోనే ఉంటోంది. ఇప్పటి వరకు ఐదు రౌండ్ల ఫలితాలు తేలగా ఇప్పటికే డాక్టర్ సుధా ఆధిక్యం 52 వేలు దాటింది. ఇదే ట్రెండ్ కొనసాగిస్తే ఆమె భారీ విజయం సాధిస్తుందని చెప్పొచ్చు. అంటే కచ్చితంగా లక్షకు పైగా మెజార్టీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ 10,478, బీజేపీ 1688, కాంగ్రెస్‌కు 580 ఓట్లు లభించాయి. ఆ తరువాత నుంచి ప్రతి రౌండ్ లోనూ అదే ఆధిక్యం కొనసాగుతూ వస్తోంది. ఇక పోస్టల్‌ బ్యాలెట్‌లోనూ వైసీపీదే ఆధిక్యం కనిపించింది.

బద్వేల్ పట్టణంలోని గురుకుల ప్రభుత్వ బాలికల పాఠశాలలో కౌంటింగ్ కొనసాగుతోంది. కోవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా భారీ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందుకోసం నాలుగు కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఎన్నికల కమిషన్‌ జారీచేసిన కోవిడ్‌ మార్గదర్శకాలను అనుసరించి ఒక్కో కౌంటింగ్‌ కేంద్రంలో ఏడు టేబుళ్లను ఏర్పాటుచేశారు. ప్రతి కేంద్రంలో ఆర్వో, ఏఆర్వోలకు ఒక టేబుల్‌ ఏర్పాటుచేశారు. ఆర్వో ఉన్న కౌంటింగ్‌ కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. ర్యాండమ్‌ చెకింగ్‌ కోసం ఒక వీవీ ప్యాట్‌ కేంద్రం ఏర్పాటుచేశారు.

ఇదీ చదవండి: ఇన్నిరోజులు గుడ్డి గాడిద పళ్లు తోమారా? పవన్‌ పై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ప్రతి కౌంటింగ్‌ కేంద్రంలో ఒక సూపర్‌వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు. గరిష్టంగా 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశముంది. నియోజకవర్గంలో మొత్తం 2,15,240 ఓట్లు ఉండగా, 1,47,213 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 68.39 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఇదీ చదవండి: పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన కమెడియన్.. పోటీ చేసేది ఎక్కడ నుంచి అంటే..?

వైఎస్సార్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణించడంతో క‌డ‌ప‌ జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. అధికార ప‌క్షం.. ఆన‌వాయితీ సెంటిమెంట్ ప్రకారం వైసీపీ బద్వేలు టికెట్ ను డాక్టర్ వెంకటసుబ్బయ్య అర్ధాంగి డాక్టర్ దాసరి సుధకు ఇచ్చింది. ప్రధాన ప్రతిప‌క్షం తెలుగు దేశం ఈ ఎన్నిక‌లో పాల్గొన‌డం లేద‌ని స్పష్టం చేసింది. తొలుత పాల్గొనాల‌ని భావించినా సెంటిమెంట్‌, ఆన‌వాయితీని పాటించాల‌ని నిర్ణయం తీసుకొంది. అంతే కాకండా గ‌త ఎన్నిక‌ల్లో ఎక్కువ‌గా ప్రభావం చూపుకున్నా.. ప్రతిప‌క్షంలా ప్రశ్నిస్తామంటూ నిరంతం ప్రజ‌ల్లో ఉండే ప్రయ‌త్నం చేస్తున్న జ‌న‌సేన కూడా పోటీ నుంచి త‌ప్పుకొంది. అయితే ఎన్నిక‌ల్లో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ పోటీ చేశాయి.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Kadapa, Ycp

ఉత్తమ కథలు