BADVEL BY POLL FINAL RESULT EVER ROUND DR SUDHA GET CLEAR MAJORITY SHE CROSS JAGAN RECORD NGS TPT
Badvel By Poll Final Result: బద్వేల్ లో రికార్డు విజయం.. సీఎం జగన్ కు సైతం షాక్.. రౌండ్ రౌండ్ కు ఇలా..?
బద్వేల్ లో డాక్టర్ సుధ ఘన విజయం
Badvel By pol Final Reslutl: బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. అది కూడా ఎవరూ ఊహించని విధంగా రికార్డు విజయం సొంతం చేసుకున్నారు వైసీపీ అభ్యర్థి.. అధినేత సీఎం జగన్ కంటే అత్యధిక మెజార్టీ సాధించి బద్వేల్ రికార్డుల్లో నిలిచింది. అయితే రౌండ్ రౌండ్ కు ఫలితం ఎలా వచ్చిందో చూద్దాం.
Badvel By pol Final Reslutl: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని సీఎం సొంత జిల్లా బద్వేల్ (Badvel) ఉప ఎన్నికలో వైసీపీ (YCP) అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా (Dasari Sudha) భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే వైసీపీ అధిష్టానం ముందు నుంచి లక్ష మెజార్టీ పక్కా అని చెబుతున్నా.. అది కాస్త దగ్గరకు వచ్చి ఆగిపోయింది. కానీ రికార్డు మెజార్టీ మాత్రం సొంతమైంది. నోటా (Nota), బీజేపీ (BJP)కి ఓట్లు పెరగడంతో వైసీపీ అభ్యర్థి లక్ష మెజార్టీకి దగ్గరకు వచ్చి ఆగిపోయారు. మొదటి రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వరకూ భారీగానే ఆధిక్యంలోనే కొనసాగిన వైసీపీ అభ్యర్థి చివరికి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సురేష్‌పై 90,533 ఓట్ల భారీ మెజార్టీతో సుధా గెలుపొందారు. తొలి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన డాక్టర్ దాసరి సుధ ముందు ఇతర పార్టీలేవి నిలబడలేకపోయాయి. మొత్తం 13 రౌండ్లు ముగిసే సరికి వైసీపీకి 1,12,211, బీజేపీకి 21,678, కాంగ్రెస్‌కు 6,235, నోటాకు 3,650 ఓట్లు పోలయ్యాయి. ఎనిమిదో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సమయానికే సుధ విజయం ఖరారైపోయింది. తరువాత రౌండ్లలోనూ ఎక్కడా ప్రత్యర్థులు పోటీలో నిలబడలేకపోయారు.
ఈ విజయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) మెజార్టీ రికార్డ్‌ను అదే జిల్లాకు చెందిన బద్వేల్ అభ్యర్థి బ్రేక్ చేశారు. 2019 ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసిన వైఎస్ జగన్.. టీడీపీ (TDP) అభ్యర్థి సింగా సతీష్ కుమార్ రెడ్డి (Satish Kumar Reddy)పై 90,110 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ రికార్డ్‌ను బద్వేల్ వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ బ్రేక్ చేసేశారు. 90,533 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. జగన్ కంటే 440 ఓట్లు ఎక్కువ మెజార్టీనే. మొత్తంగా వైసీపీ భారీ మెజార్టీతో బద్వేలు సీటును సొంతం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
వైఎస్ జగన్ రికార్డ్‌నే కాదు 2019 ఎన్నికల్లో తన భర్త మెజార్టీకి డబుల్ ఓట్లను డాక్టర్ సుధ దక్కించుకున్నారు. 2019లో వైసీపీ తరఫున పోటీ చేసిన వెంకట సుబ్బయ్య 44,734 మెజార్టీతో గెలుపొందగా.. ఆకస్మిక మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి సుధ 90,533 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. మొత్తంమ్మీద రెండు రికార్డులను సుధ బ్రేక్ చేశారు. మరో విషయం ఏమిటంటే గత ఎన్నికల్లో 2,004 ఓట్లు నోటాకు రాగా దానికి డబుల్ ఓట్లు ఈ ఉప ఎన్నికలో పోలయ్యాయి.
వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ ఏ రౌండ్ లోనూ వెనుకబడినట్టు కనిపించలేదు. కౌంటింగ్ మొదలైన తొలి రౌండ్ నుంచి ప్రతి రౌండ్ కు ఆధిక్యం పెరుగుతూ వచ్చింది.. ఆ వివరాలు ఇవే..
ఇక బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ సాధించిన ఘన విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల అమలు తీరుకు ఈ విజయం నిదర్శనమన్నారు. ఇది బడుగు బలహీన వర్గాలు, సామాన్యుడి విజయమని చెప్పారు. పోటీ చేయడంలేదని చెప్పిన టీడీపీ వెనుక ఉండి బీజేపీని నడిపించిందని ఆరోపించారు. ఇప్పటికైనా విభజన చట్టంలోని ప్రత్యేక హోదా హామీని కేంద్రం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బలహీన పరిచేందుకు ప్రతిపక్షాలు కుట్రపన్నుతున్నాయన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారని మండిపడ్డారు. అఖిల పక్ష సమావేశం పెడతామని వైసీపీ మొదట్నుంచీ చెబుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తడి తీసుకొస్తూనే ఉందని చెప్పారు. ప్రజల తీర్పును అగౌరవ పరిచడాన్ని విపక్షాలు మానుకోవాలని శ్రీకాంత్‌రెడ్డి హితవు పలికారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.