Badvel By Election Result 2021 Update: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి (cm jagan mohan reddy) సొంతం జిల్లా కడపలోని బద్వేల్ నియోజకవర్గం బై పోల్ ఫలితాల్లో అధికార వైసీపీ (YCP) దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికి వెలువడిన ప్రతి రౌండ్ లోనూ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా ఆధిక్యం వేలల్లోనే ఉంటోంది. ఇప్పటి వరకు నాలుగు రౌండ్ల ఫలితాలు తేలగా ఇప్పటికే 30 వేలకుపైగా ఆధిక్యంలో ఉన్నారు ఆమె.. ప్రతి రౌండ్ లో ఇదే దూకుడు కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో 9వేల ఓట్ల ఆధిక్యం వచ్చింది.. తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ 10,478, బీజేపీ 1688, కాంగ్రెస్‌కు 580 ఓట్లు లభించాయి. ప్రతి రౌండ్ లోనూ అదే ఆధిక్యం కొనసాగుతూ వస్తోంది. ఇక పోస్టల్ బ్యాలెట్‌లోనూ వైసీపీదే ఆధిక్యం కనిపించింది. బద్వేల్ పట్టణంలోని గురుకుల ప్రభుత్వ బాలికల పాఠశాలలో కౌంటింగ్ కొనసాగుతోంది. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా భారీ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందుకోసం నాలుగు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఎన్నికల కమిషన్ జారీచేసిన కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో ఏడు టేబుళ్లను ఏర్పాటుచేశారు. ప్రతి కేంద్రంలో ఆర్వో, ఏఆర్వోలకు ఒక టేబుల్ ఏర్పాటుచేశారు. ఆర్వో ఉన్న కౌంటింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ర్యాండమ్ చెకింగ్ కోసం ఒక వీవీ ప్యాట్ కేంద్రం ఏర్పాటుచేశారు.
ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ఒక సూపర్‌వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. గరిష్టంగా 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశముంది. నియోజకవర్గంలో మొత్తం 2,15,240 ఓట్లు ఉండగా, 1,47,213 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 68.39 శాతం పోలింగ్ నమోదైంది.
ఇదీ చదవండి: ఏపీ టీడీపీలో ముదురుతున్న వార్.. అచ్చెన్న వర్సెస్ కళా వెంకట్రావు..! పై చేయి ఎవరిది..?
వైఎస్సార్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణించడంతో కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఆవశ్యకత ఏర్పడింది. అధికార పక్షం.. ఆనవాయితీ సెంటిమెంట్ ప్రకారం వైసీపీ బద్వేలు టికెట్ ను డాక్టర్ వెంకటసుబ్బయ్య అర్ధాంగి డాక్టర్ దాసరి సుధకు ఇచ్చింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం ఈ ఎన్నికలో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. తొలుత పాల్గొనాలని భావించినా సెంటిమెంట్, ఆనవాయితీని పాటించాలని నిర్ణయం తీసుకొంది. అంతే కాకండా గత ఎన్నికల్లో ఎక్కువగా ప్రభావం చూపుకున్నా.. ప్రతిపక్షంలా ప్రశ్నిస్తామంటూ నిరంతం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్న జనసేన కూడా పోటీ నుంచి తప్పుకొంది. అయితే ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పోటీ చేశాయి.
ఇదీ చదవండి:పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన కమెడియన్.. పోటీ చేసేది ఎక్కడ నుంచి అంటే..?
ఏకగ్రీవం అవుతుందనుకున్న బద్వేల్ అసెంబ్లీ ఉపఎన్నిక… BJP పోటీకి దిగడంతో రసవత్తరంగా మారింది. 2019 ఎన్నికల్లో YCP అభ్యర్ధిగా డాక్టర్ వెంకటసుబ్బయ్య 44,734 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయితే ఆయన అకాల మరణంతో ఉపఎన్నిక రావడంతో …ఏకగ్రీవం చేయాలని పిలుపునిచ్చింది వైసీపీ. ఇందుకు జనసేన, టీడీపీ పోటీకి దూరంగా ఉంటే…గత ఎన్నికల్లో కేవలం 735 ఓట్లు మాత్రమే వచ్చిన బీజేపీ మాత్రం అభ్యర్దిని బరిలోకి దింపింది. మరి ఈ సారి ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి.. బీజేపీ నేతలు మాత్రం టీడీపీ, జనసేన ఓట్లపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అందుకు ప్రభుత్వానికి గట్టి పోటీ ఇచ్చి తీరుతామని అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Ycp