హోమ్ /వార్తలు /National రాజకీయం /

badvel bypoll : చంద్రబాబుకు భారీ షాక్ -బీజేపీపై పవన్ ఎఫెక్ట్ ఎంతంటే -ఇవిగో లెక్కలు..

badvel bypoll : చంద్రబాబుకు భారీ షాక్ -బీజేపీపై పవన్ ఎఫెక్ట్ ఎంతంటే -ఇవిగో లెక్కలు..

బద్వేల్ ఫలితం

బద్వేల్ ఫలితం

బద్వేల్ లో బీజేపీకి గతంలో కంటే దాదాపు 20వేల ఓట్లు అదనంగా వచ్చాయి. టీడీపీని వైసీపీ వ్యతిరేక ఓటుగా భావిస్తే అవన్నీ(50వేల ఓట్లు) గంపగుత్తగా బీజేపీకి పడలేదు. విచిత్రంగా కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు పెరిగాయి. బీజేపీకి దక్కిన 20 వేల ఓట్లలో జనసేన ఓట్లు ఎన్ని? పవన్ ప్రభావం ఏ మేరకు పనిచేసింది?

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక మెజార్టీని నమోదు చేస్తూ బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఘన విజయం సాధించారు. సునాయాసమైన గెలుపులో తమ ఫోకస్ మొత్తం మెజార్టీపైనే ఉందని వైసీపీ నేతలు చెప్పిన మాటలు మంగళవారం నాటి ఫలితాల్లో ప్రస్పుటమయ్యాయి. అయితే, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ.. బద్వేల్ ఉప ఎన్నికలో పోటీకి దూరంగా ఉన్నప్పటికీ.. ఓట్లు బదిలీ అయిన తీరు ఆ పార్టీకి మింగుడు పడని వ్యవహారంలా తయారైంది. అటు బీజేపీ-జనసేన కూటమిలో జూనియర్ ఎవరు? సీనియర్ ఎవరు? అనే పంచాయితీకి కూడా బద్వేల్ ఫలితంతో స్పష్టమైన సమాధానం లభించినట్లయింది. కూటమిలో పెద్ద పీట కోరుతోన్న పవన్ కల్యాణ్.. బద్వేల్ లో బీజేపీని ఏమాత్రం ఆదుకోలేకపోయినట్లు లెక్కల్లో తేలింది. జగన్ సంక్షేమ పాలనకు జనం అందించిన మరో గిఫ్టే బద్వేల్ అని వైసీపీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు. పూర్తి వివరాలివి..

కడప జిల్లాలో ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానమైన బద్వేల్ తొలి నుంచీ మిశ్రమ రాజకీయాలకు వేదికగా నిలిచింది. ప్రజాసోషలిస్టు, స్వతంత్ర, జనతా పార్టీల అభ్యర్థులు ఇక్కడి నుంచి గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత మూడు సార్లు ఆ స్థానాన్ని గెల్చుకుంది. అయితే, జగన్ (2011లో) పార్టీ పెట్టిన తర్వాత 2014, 2019 సాధారణ ఎన్నికల్లో వైసీపీ గెలిచినా, ప్రత్యర్థి టీడీపీ నుంచి గట్టి పోటీ ఎదురుర్కోవాల్సి వచ్చింది. కానీ ప్రస్తుత ఉప ఎన్నికలో మాత్రం అసలు ప్రత్యర్థులు ఉన్నారా? అనేంత స్థాయిలో వైసీపీ బంపర్ మెజార్టీ సాధించింది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయి..

బద్వేల్ స్థానానికి 2014లో జరిగిన ఎన్నికలో టీడీపీకి 44.18శాతంతో దాదాపు 70వేల ఓట్లు పడ్డాయి. అదే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓట్ల శాతం 32.36కు పడిపోయినా 50వేల పైచిలుకు ఓట్లు సాధించి గట్టి పోటీ ఇచ్చింది. కానీ ప్రస్తుత ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయలేదు. ఏకగ్రీవానికి మద్దతిస్తామని టీడీపీ ప్రకటించినా, జనసేన మద్దతుతో బీజేపీ, ఒటరిగా కాంగ్రెస్ బరిలోకి దిగాయి. ఓటింగ్ అనివార్యమని తెలిసినా.. టీడీపీ అధినేత చంద్రబాబు కనీసం అందర్గతంగానైనా పార్టీ శ్రేణులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో బద్వేల్ సెగ్మెంట్ లోని టీడీపీ ఓటు బ్యాంకు భారీగా చీలిపోయింది. హార్డ్ కోర్ టీడీపీ అభిమానులు తప్ప మెజార్టీ తెలుగు తమ్ముళ్లు జగన్ పార్టీకే ఓట్లేసిన సినారియో కనిపిస్తోంది. వైసీపీ అంటే బొత్తిగా గిట్టనివాళ్లు మాత్రమే బీజేపీకి ఓటేసినట్లు తెలుస్తోంది. మరి..

గత ఎన్నికల్లో(2019లో) బద్వేల్ స్థానంలో బీజేపీకి కేవలం 735 ఓట్లు వచ్చాయి. నాటి ఎన్నికల్లో మాయవతి బీఎస్పీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ బద్వేల్ సీటును బీఎస్పీకి కేటాయించగా, ఏనుగు గుర్తుకు 1321 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్ పార్టీకేమో 2337ఓట్లు పడ్డాయి. అదే ప్రస్తుత ఉప ఎన్నిక ఫలితాల్లో మాత్రం బీజేపీకి 21621 ఓట్లు రాగా, కాంగ్రెస్ ఆభ్యర్దికి 6205, నోటాకు 3635ఓట్లు వచ్చాయి. అంటే బీజేపీకి గతంలో కంటే దాదాపు 20వేల ఓట్లు అదనంగా పడ్డట్టు లెక్క. టీడీపీ ఓటు బ్యాంకును వైసీపీ వ్యతిరేక ఓట్లుగా భావిస్తే అవన్నీ(50వేల ఓట్లు) గంపగుత్తగా బీజేపీకి పడలేదు. విచిత్రంగా కాంగ్రెస్ అభ్యర్థికి గతంలో కంటే నాలుగు వేల ఓట్లు అదనంగా వచ్చిపడ్డాయి. మరి బీజేపీకి అదనంగా దక్కిన 20 వేల ఓట్లలో జనసేన ఓట్లు ఎన్ని? బద్వేల్ లో బీజేపీకి పవన్ కల్యాణ్ వల్ల లాభమేమైనా జరిగిందా? అనే సున్నా అనే సమాధానం వినిపిస్తోంది. మొత్తంగా టీడీపీ ఓటు బ్యాంకు చీలిపోవడం ద్వారా చంద్రబాబుకు, పవన్ అసమర్థతను గుర్తించడానికి బీజేపీకి బద్వేల్ ఉప ఎన్నిక షాక్ లాంటిదనే కామెంట్లు వస్తున్నాయి.

First published:

Tags: Andhra Pradesh, Andhra pradesh news, Bjp-janasena, Chandrababu Naidu, Pawan kalyan, TDP

ఉత్తమ కథలు