బీజేపీలో చేరిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్..

బీజేపీలో చేరిన సైనా నెహ్వాల్

బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్(29) రాజకీయాల్లోకి వచ్చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో ఆమె చేరారు. బుధవారం నాడు బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

  • Share this:
    బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్(29) రాజకీయాల్లోకి వచ్చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో ఆమె చేరారు. బుధవారం నాడు బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సైనా మాట్లాడుతూ.. దేశాభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. క్రీడల అభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారని, అందుకే బీజేపీలో చేరానని అన్నారు. మోదీ నేతృత్వంలో పని చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నట్లు ఆమె ప్రకటించారు. సైనాతో పాటు ఆమె సోదరి చంద్రాన్షు నెహ్వాల్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

    కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సైనాతో ప్రచారం చేయించేందుకు బీజేపీ రెడీ అవుతోంది. దేశవ్యాప్తంగా ఆమెకు ఉన్న స్టార్‌డమ్‌ను ఈ ఎన్నికల్లో వాడుకోవాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. హైదరాబాదీ అయినా.. హరియాణాలో పుట్టింది. బ్యాడ్మింటన్ క్రీడను ఎంచుకొని ఎన్నో పతకాలు గెలిచి దేశానికి వన్నె తెచ్చింది. ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచింది. మొత్తంగా 24 అంతర్జాతీయ అవార్డులు గెలిచింది. అందుకుగానూ కేంద్ర ప్రభుత్వం ఆమెను రాజీవ్ ఖేల్‌రత్న, అర్జున అవార్డుతో సత్కరించింది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: