Home /News /politics /

సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు.. అరుదైన బహుమతి ఇచ్చిన..

సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు.. అరుదైన బహుమతి ఇచ్చిన..

సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు

సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు

PV Sindhu meets YS Jagan : వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా నిలిచి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తన తల్లిదండ్రులతో కలిసి వచ్చిన ఆమె సీఎంను సచివాలయంలో కలిశారు.

ఇంకా చదవండి ...
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా నిలిచి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తన తల్లిదండ్రులతో కలిసి వచ్చిన ఆమె సీఎంను సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆమెను సీఎం జగన్ శాలువాతో సత్కరించారు. ఆమెతో పాటు మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు ఉన్నారు. సింధూ.. తనకు దక్కిన బంగారు పతకాన్ని సీఎం జగన్‌కు చూపిస్తూ మురిసిపోయారు. అనంతరం ఒక బ్యాడ్మింటన్ బ్యాటును సీఎంకు బహుకరించారు. కాగా, అంతకుముందు.. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న పీవీ సింధుకు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ప్రవీణ్ కుమార్, స్పోర్ట్స్ ఎండీ భాస్కర్ ఘన స్వాగతం పలికారు.

బంగారు పతకాన్ని సీఎం జగన్‌కు చూపిస్తున్న పీవీ సింధు


ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. ‘మూడో ప్రయత్నంలో ప్రపంచ బ్యాట్మింటన్ ఛాంపియన్ షిప్ సాధించాను. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సర్ ఫోన్ చేసి నన్ను అభినందించారు. జగన్ సర్‌ని కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకే విజయవాడ వచ్చాన’ని సింధు తెలిపింది.

First published:

Tags: Andhra Pradesh, Badminton, India, Pv sindhu, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు