ఆ టీడీపీ నేత గెలిస్తే చంద్రబాబు ప్రతిపక్షమేనా ?

అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. తాజాగా ఇదే సెంటిమెంట్ టీడీపీని టెన్షన్ పెడుతోందనే ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: April 20, 2019, 12:31 PM IST
ఆ టీడీపీ నేత గెలిస్తే చంద్రబాబు ప్రతిపక్షమేనా ?
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: April 20, 2019, 12:31 PM IST
రాజకీయాల్లోనూ కొన్ని సెంటిమెంట్లు కీలక పాత్ర పోషిస్తుంటాయి. కొందరు నాయకులు గెలిస్తే... వారు పోటీ చేసిన పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంటుంది. అదే సమయంలో కొందరు నాయకులు గెలిస్తే... వారి పార్టీ ప్రతిపక్షానికి పరిమితమవుతుందనే బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఉంది. ఈ రకమైన సెంటిమెంట్ ‌ఉన్న నాయకుడే అనంతపురం జిల్లా ఉరవకొండ మాజీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్. టీడీపీలో మంచి వాగ్దాటి ఉన్న నేతగా, చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరున్న పయ్యావుల కేశవ్‌ను ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే... టీడీపీ ప్రతిపక్షానికి పరిమితవుతుందనే ప్రచారం ఉంది.

పయ్యావుల కేశవ్ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో కలుపుకుంటే ఐదుసార్లు అసెంబ్లీకి పోటీ చేశారు. 1999లో తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసిన ఆయన... ఆ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. అయితే అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇక 2004, 2009లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ సమయంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికార పక్షాన్ని ఎదుర్కోవడంలో కేశవ్ ఎప్పుడూ ముందుండేవారు. ఈ క్రమంలో ఆయన చంద్రబాబుకు బాగా దగ్గరయ్యారు. 2014 ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ గెలిస్తే... ఆయన కచ్చితంగా మంత్రి అవుతారనే ప్రచారం కూడా జరిగింది.

కానీ అనూహ్యంగా ఆయన ఓటమి పాలయ్యారు. తన ప్రత్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి చేతిలో ఆయన ఓటమిని చవిచూశారు. తాజాగా 2019 ఎన్నికల్లోనూ ఉరవకొండ నుంచి ఆయన మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ సారి ఆయన ఎన్నికల్లో గెలుస్తారా లేదా అనే చర్చతో పాటు ఆయన గెలిస్తే టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమవుతుందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మొత్తానికి ఈ సారి కూడా పయ్యావుల కేశవ్ గెలిచి టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైతే... ఆయన విషయంలోజరుగుతున్న బ్యాడ్ సెంటిమెంట్ ప్రచారం మరింతగా పాపులర్ అవుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...