గుంటూరు టీడీపీ నేతను వెంటాడిన బ్యాడ్ సెంటిమెంట్... జిల్లాలో ఎవరైనా అంతే...

ఐదుసార్లు ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించిన గుంటూరు జిల్లా టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పరాజయం వెనుక బ్యాడ్ సెంటిమెంట్ ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: June 19, 2019, 7:04 PM IST
గుంటూరు టీడీపీ నేతను వెంటాడిన బ్యాడ్ సెంటిమెంట్... జిల్లాలో ఎవరైనా అంతే...
తెలుగుదేశం పార్టీ లోగో
news18-telugu
Updated: June 19, 2019, 7:04 PM IST
ఆయన టీడీపీ సీనియర్ నేత. వరుసగా ఆరుసార్లు గెలిచిన నాయకుడు. ఇతర పార్టీల హవా బలంగా వీచిన సమయంలోనూ తన నియోజకవర్గంలో గెలిచిన ఘనత ఆయన సొంతం. కానీ అలాంటి నాయకుడు సైతం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రజావ్యతిరేకత వల్లే ఆయన ఓడిపోయారని ప్రత్యర్థులు చెబుతున్నా... టీడీపీ నేతలు మాత్రం ఓ బ్యాడ్ సెంటిమెంట్ కారణంగానే ఆయన పరాజయం పాలయ్యారని చర్చించుకుంటున్నారు. ఆయనే గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. టీడీపీ నేత ధూళిపాళ్ల వీరయ్య చౌదరి కుమారుడైన నరేంద్ర... తన తండ్రి హఠాన్మరణం కారణంగా రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత పొన్నూరులో తిరుగులేని నేతగా ఎదిగారు.

మొదట 1994 ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ధూళిపాళ్ల నరేంద్ర. తర్వాత 1999 ఎన్నికల్లో కూడా రెండోసారి విజయం సాధించారు. 2004లోనూ, మూడోసారి కాంగ్రెస్ గాలిలో కూడా విజయంతో హాట్రిక్ కొట్టారు. 2009 ఎన్నికల్లో నరేంద్ర నాలుగోసారి పోటీ చేసి ప్రత్యర్థిపై విజయం సాధించారు. 2014 ఎన్నికలు కూడా ధూళిపాళ్ల విజయాన్ని ఆపలేకపోయాయి. అపజయం ఎరుగని నేతగా గుర్తింపు పొందారు. దీంతో 2019లోనూ ఆయన గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఈ సారి మాత్రం ఆయన అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.

dhulipalla narendra kumar,Guntur leaders bad sentiment,tdp mla dhulipalla narendra kumar interview,dhulipalla narendra,mla dhulipalla narendra,narendra kumar,ponnur tdp mla candidate dhulipalla narendra,dhulipalla narendra kumar face to face,ponnur mla dhulipalla narendra,ponnur mla narendra kumar dhulipalla,narendra kumar dhulipalla,chandrababu latest news,tdp latest news,Guntur latest news,ధూళిపాళ్ల నరేంద్రకుమార్,టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర,పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
ధూళిపాళ్ల నరేంద్రకుమార్(ఫైల్ ఫోటో)


ఆయన ఓటమికి అనేక కారణాలు ఉన్నా... ఆరో నెంబర్‌ సెంటిమెంట్ రిపీట్ కావడం వల్లే ఆయన ఓడిపోయారని జిల్లా టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గుంటూరు జిల్లాలో వరుసగా ఐదుసార్లు గెలిచిన జాబితాలోనే కోడెల శివప్రసాదరావు, మాకినేని పెదరత్తయ్య, కన్నా లక్ష్మీనారాయణలు ఉన్నారు. అయితే వరుసగా ఆరోసారి మాత్రం వీళ్లెవరు విజయం సాధించలేకపోయారు. దీంతో అదే సెంటిమెంట్ ధూళిపాళ్ల నరేంద్రకు కూడా వర్కవుట్ అయ్యిందనే గుసగుసలు జోరందుకున్నాయి.


First published: June 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...