Home /News /politics /

BACKING RAHUL GANDI TS CM KCR ALSO DEMANDS PROOF OF SURGICAL STRIKES SAYS INDIAN ARMY SHOULD GET CREDIT NOT BJP MKS

CM KCR: కాంగ్రెస్‌తో పొత్తుపై కేసీఆర్ కుండబద్దలు -ఆ విషయంలో Rahul Gnadhiకి కడదాకా మద్దతు

రాహుల్ గాంధీకి కేసీఆర్ సమర్థన

రాహుల్ గాంధీకి కేసీఆర్ సమర్థన

సర్జికల్ స్ట్సైక్స్ నిజంగా జరగలేదనే అనుమానం సగానికిపైగా భారతీయులకు ఉందని, దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, ఈ విషయంలో రాహుల్ గాంధీని ఏ తప్పూ లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.

యావత్ దేశం పుల్వామా అమరవీరులకు నివాళి అర్పిస్తున్న వేళ.. గతంలో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ అంశంపై రాజకీయ రచ్చ తారా స్థాయికి చేరింది. భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ ను బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుందని, అసలు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయో లేదో మోదీ సర్కార్ ఆధారాలను బయటపెట్టాలన్న రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం, దేశాన్నే అనుమానిస్తారా అంటూ రాహుల్ పై అస్సాం బీజేపీ సీఎం హిమంత అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ ఉదంతంపై తీవ్రంగా స్పందించారు. సర్జికల్ స్ట్సైక్స్ నిజంగా జరగలేదనే అనుమానం సగానికిపైగా భారతీయులకు ఉందని, దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, ఈ విషయంలో రాహుల్ గాంధీని ఏ తప్పూ లేదని కేసీఆర్ అన్నారు. ఆదివారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

‘చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, ఒక ఎంపీని పట్టుకుని ఎవరికి పుట్టావని ప్రశ్నించే కుసంస్కారంతో బీజేపీ ఉండటం సరైందేనా? ఇది ఎంతవరకు సమంజసం? దీనిని బీజేపీ ప్రోత్సహిస్తుందా? అసోం సీఎంను బర్తరఫ్‌ చేయాలి. ఈ విషయంలో బీజేపీని వెంటాడుతాం. రాహుల్‌గాంధీ కుటుంబంతో నాకు ఎలాంటి బంధుత్వం లేదు. వారితో, వారి పార్టీతో నాకు సంబంధం లేదు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ టై అప్‌ అని మాట్లాడుతున్నారు. అది సరికాదు. ఉద్యమంలో సోనియా గురించి తప్పుగా ఎప్పుడూ మాట్లాడలేదు. నేను హార్ష్‌గా మాట్లాడుతా. కానీ అవమానించను’అని కేసీఆర్ అన్నారు. తర్వారా రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చినంత మాత్రాన కాంగ్రెస్ తో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోనుందనే ఊహాగానాలకూ కేసీఆర్ తెరదించారు. ఇక..

KCR National party: కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు కేసీఆర్ సై -Prashant Kishor సర్వేపైనా..


సర్జికల్‌ స్ట్రయిక్స్‌ గురించి అడగడంలో రాహుల్‌గాంధీ తప్పేమీలేదన్న కేసీఆర్.. ఇప్పుడు తాను కూడా అడుగుతున్నానని, సర్జికల్‌ స్ట్రయిక్స్‌కి కేంద్రం ఆధారాలు చూపించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ‘తప్పకుండా ఇదో రాజకీయ జిమ్మిక్కు. ఇదో పెద్ద అనుమానం. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రజల్లో అనేక అనుమానాలున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. మీరు నియంత, రాజు కాదు. ఇది ప్రజాస్వామ్యం కాంగ్రెస్‌ పార్టీ నేతగా, ఒక ఎంపీగా రాహుల్‌ ఆధారాలు అడిగారు. మీరు సమాధానం చెప్పాలి. లేకుంటే మౌనం వహించాలి. కానీ, దూషించడం సరికాదు. ఈ విషయంలో రాహుల్ గాంధీకి చివరికిదాకా మా మద్దతు ఉంటుంది.

New Constitution : కొత్త రాజ్యాంగంపై CM KCR తాజా బాంబు.. దళిత సంఘాలకు సంబంధమేంటి?


ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు సరిహద్దులో ఏదో ఒక అలజడి జరుగుతుంది. కొన్ని ప్రాణాలు పోతాయి. దానిని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ఇది దురదృష్టకరం. ఇది బీజేపీకి అలవాటుగా మారింది. బిపిన్‌ రావత్‌ ప్రమాదంలో చనిపోతే ఉత్తరాఖండ్‌ ప్రచారంలో ఆయన ఫొటోతో బీజేపీ జెండాలతో ప్రచారం చేస్తున్నారు. వాట్‌ ఈజ్‌ దిస్‌ నాన్సెన్స్‌! బీజేపీ థర్డ్‌ క్లాస్‌ పార్టీ.. సరిహద్దులో ఆర్మీ పోరాడుతోంది. సైనికులు చనిపోతున్నారు. క్రెడిట్‌ కూడా ఆర్మీకే వెళ్లాలి. ఆర్మీకి మనమంతా సెల్యూట్‌ చేయాలి. బీజేపీకి ఎందుకు క్రెడిట్‌ వెళ్లాలి..’అని కేసీఆర్ అన్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Congress, Pm modi, Rahul Gandhi, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు