Home /News /politics /

AYYANNAPATHRUDU SANYASI PATRUDU FIGHT FOR PARTY FLAGS IN NARSIPATNAM SK

టీడీపీ సీనియర్ నేత ఇంట్లో రచ్చ.. చిచ్చుపెట్టిన వైసీపీ జెండా

ఇంటిపై టీడీపీ, వైసీపీ జెండాలు

ఇంటిపై టీడీపీ, వైసీపీ జెండాలు

మళ్లీ ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. చివరకు ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. సన్యాసిపాత్రుడు కుమారుడు తనపై దాడి చేశాడని పెతపాత్రుడి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ఇద్దరు నేతలు సొంత అన్నాదమ్ముళ్లు. ఒకరు టీడీపీ. మరొకరు వైసీపీ. పార్టీలు వేరైనా ఇద్దరు ఒకే భవనంలో ఉంటున్నారు. ఐతే వీరి మధ్య పార్టీ జెండాలు చిచ్చుపెట్టాయి. రాజకీయ పార్టీల కోసం ఇరువురి కుటుంబాలు బంధాలను పక్కనబెట్టి కొట్లాటకు దిగాయి. వీరి వ్యవహారం చివరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. వాళ్లెవరో కాదు.. చింతకాయల అయ్యన్నపాత్రుడు-చింతకయాల సన్యాసి పాత్రుడు.

    నర్సీపట్నంలో అన్నాదమ్ముళ్లు ఒకే ఇంట్లో ఉంటున్నారు. పై అంతస్తులో ఒకరు..కింది అంతస్తులో మరొకరు నివసిస్తున్నారు. ఐతే ఇటీవల వైసీపీలో చేరిన అయ్యన్నపాత్రుడు తమ్ముడు సన్యాసి పాత్రుడు కుటుంబ సభ్యులు ఇంటిపై వైసీపీ జెండా కట్టేందుకు ప్రయత్నించారు. సన్యాసి పాత్రుడు కుమారుడు వరుణ్ జెండా కడుతున్న సమయంలో అయ్యన్నపాత్రుడి కుటుంబ సభ్యురాలైన లక్ష్మి అడ్డుకుంది. ఈ క్రమంలో వాగ్వాదం జరిగి.. తోపులాటలో ఆమె కిందపడిపోయింది. లక్ష్మి అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

    మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు(Image: Facebook)
    మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు(ఫైల్ ఫొటో: Facebook)


    ఆ తర్వాత సన్యాసిపాత్రుడి కుటుంబ సభ్యులు మరోసారి వైసీపీ జెండా కట్టేందుకు ప్రయత్నించారు. అప్పుడు కూడా అయ్యన్నపాత్రుడి ఫ్యామిలీ అడ్డుపడింది. ఈ క్రమంలో మళ్లీ ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. చివరకు ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. సన్యాసిపాత్రుడు కుమారుడు తనపై దాడి చేశాడని పెతపాత్రుడి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు సన్యాసిపాత్రుడి ఫ్యామిలీ సైతం అయ్యన్నపాత్రుడి కుటుంబంపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో ఆ ఇంటి వద్ద పోలీసులు సెక్యూరిటీ పెంచారు.

    అయ్యన్నపాత్రుడు టీడీపీ సీనియర్ నేత. గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఏప్రిల్‌లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి పోటీచేసిన అయ్యన్న వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్ చేతిలో ఓడిపోయారు. ఆ ఓటమిని జీర్ణించుకునే లోపే ఆయన తమ్ముడు గట్టి షాకిచ్చారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ గూటికి చేరారు. ఇరువురు వేర్వేరు పార్టీల్లో ఉండడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. ఈ విషయంలో అన్నాదమ్ముళ్లు స్పందించాల్సి ఉంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Ayyannapatrudu, Tdp, Ysrcp

    తదుపరి వార్తలు