రోజాపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయేషా తల్లి

21 రోజుల్లో నిందితుల్ని పట్టుకుంటామన్న సీఎం జగన్... ఆయేషా కేసును కూడా పరిగణలోనికి తీసుకోవాలన్నారు.

news18-telugu
Updated: December 14, 2019, 8:36 AM IST
రోజాపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయేషా తల్లి
ఆయేషా తల్లి వ్యాఖ్యలపై స్పందించిన రోజా
  • Share this:
విజయవాడ ఆయేషా మీరా మర్డర్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది.  ఆయేషా డెడ్ బాడీకి 12 ఏళ్ల తర్వాత ఇవాళ రిపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఆయేషా తల్లి బేగం కీలక వ్యాఖ్యలు చేశారు. ఘటన జరిగినప్పుడు హడావుడి చేసిన రోజా .. ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నిందితులు ఎవరో రోజాకు తెలుసు అన్నారు. 21 రోజుల్లో నిందితుల్ని పట్టుకుంటామన్న సీఎం జగన్... ఆయేషా కేసును కూడా పరిగణలోనికి తీసుకోవాలన్నారు. దేశంలో న్యాయం ఉందన్న నమ్మకం లేదని బేగం ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయంకోసం 12 ఏళ్ల నుంచి పోరాడుతున్నామన్నారు.

2007 డిసెంబర్‌లో విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఆయేషా మీరా దారుణహత్య జరిగింది. అప్పట్నుంచీ ఈ కేసులో ప్రతీ మలుపు సంచలనంగా మారింది. చివరకు ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సత్యం బాబును 2017 మార్చి 31న హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆయేషా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషి అని తేలాడు కానీ... అసలు దోషులెవరో బయటపడలేదు. ఈ హత్య జరిగినప్పుడు ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.

 

First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>