కేసుల మాఫీ కోసమే వైసీపీలోకి...గంటాపై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

కేసుల మాఫీ కోసమే టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు.

news18-telugu
Updated: August 4, 2020, 11:29 PM IST
కేసుల మాఫీ కోసమే వైసీపీలోకి...గంటాపై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ (ఫైల్ ఫోటో)
  • Share this:
టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసుల మాఫీ కోసమే గంటా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని అవంతి విమర్శించారు. గంటా వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని జరుగుతున్నట్లు ప్రచారానికి బలం చేకూర్చేలా మంత్ర అవంతి వ్యాఖ్యలు ఉన్నాయి.  గంటా దొడ్డిదారిన వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.  అధికారం ఎక్కడ ఉంటే గంటా శ్రీనివాసరావు అక్కడ ఉంటారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం లేకపోతే గంటా శ్రీనివాసరావు ఉండలేరని ఎద్దేవా చేశారు.   సైకిళ్లు, భూ కుంభకోణాల్లో గంటా, ఆయన అనుచరుల ప్రమేయం ఉందని  ఆరోపించారు. గంటా శ్రీనివాసరావు కుంభకోణాలను విజయసాయిరెడ్డికి చెప్పానని, గతంలో గంటాపై మంత్రివర్గ సహచరుడే ఫిర్యాదు చేశారని మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు.

avanthi srinivas, ganta srinivas, avanthi vs ganta, vizag politics, tdp vs ysrcp, గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్, విశాఖ రాజకీయాలు, ఏపీ రాజకీయాలు
అవంతి శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు


టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరేందుకు గంటా సిద్ధంగానే ఉన్నా...ఆయన్ను పార్టీలోకి తీసుకోవద్దని విశాఖ జిల్లా వైసీపీ నేతలు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాాచారం. గంటా వైసీపీలో రాకుండా అడ్డుకునేందుకు అవంతి శ్రీనివాస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  దీంతో గంటా చేరికను వ్యతిరేకిస్తున్న జిల్లా పార్టీ నేతలను ఒప్పించే ప్రయత్నాల్లో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గంటా టీడీపీని వీడి వైసీపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో...దీనికి బలం చేకూర్చుతూ మంత్రి ఆవంతి చేసిన వ్యాఖ్యలు జిల్లాతో పాటు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పార్టీలో గంటాను చేర్చుకునేందుకు ఇప్పటికే సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అంతా అనుకున్నట్లు జరిగితే  ఈ నెల 9న లేదా ఈ నెల 15న గంటా సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవచ్చని తెలుస్తోంది.
Published by: Janardhan V
First published: August 4, 2020, 11:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading