Andhra Pradesh: మరో ఆలయంపై దాడి.. ఆంజనేయుడి విగ్రహం ధ్వంసం

ఏపీలో ఆలయాలపై దాడులు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఆంజనేయ స్వామి విగ్రహంపై దుండగులు దాడికి దిగారు. ఆలయాలపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

news18-telugu
Updated: September 25, 2020, 5:05 PM IST
Andhra Pradesh: మరో ఆలయంపై దాడి.. ఆంజనేయుడి విగ్రహం ధ్వంసం
ఏపీలో మరో ఆలయంపై దాడి
  • Share this:
ఏపీలో అంతర్వేది రథం దగ్ధం తర్వాత వరసగా జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓ వైపు హిందూ దేవాలయాలు, మరోవైపు చర్చిలపై దుండగులు దాడులకు తెగబడుతున్నారు. ఈ వరస ఘటనలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. దీంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా నెల్లూరు జిల్లా నాయుడుపేట నగర పంచాయతీ పరిధిలోని తుమ్మూరు ప్రాంతంలో ఏడడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం తల, తోక భాగం పగలగొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఎవరైనా చేశారా? ఆకతాయిల పనా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో ఆలయాలపై వరసగా దాడులు జరగడంపై పార్టీలతో పాటు, హిందూ సంస్థలు ఆగ్రహం వ్యకం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు వైసీపీ అధికారంలోకి వచ్చాకే హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని పలు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
Published by: Nikhil Sangani
First published: September 25, 2020, 5:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading