హోమ్ /వార్తలు /రాజకీయం /

ESI Scam | సీఎం జగన్‌‌‌పై అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు...

ESI Scam | సీఎం జగన్‌‌‌పై అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు...

అచ్చెన్నాయుడు

అచ్చెన్నాయుడు

‘పది మందికి మంచి చేసే కార్యక్రమాలు చేస్తాం తప్ప తప్పు చేసే అలవాటు లేదు. ఎర్రన్నాయుడి సాక్షిగా చెబుతున్నా. నీ దిక్కున్నది చేసుకో.’ అని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న సమయంలో ఈఎస్ఐ లోమందుల కొనుగోళ్లకు సంబంధించి భారీ కుంభకోణం జరిగిందంటూ ఇటీవల విజిలెన్స్ నివేదిక బయటకు వచ్చింది. దీనిపై అచ్చెన్నాయుడు స్పందించారు. ‘ఎక్కడా తప్పు చేయాల్సిన అవసరం మాకు లేదు. పది మందికి మంచి చేసే కార్యక్రమాలు చేస్తాం తప్ప తప్పు చేసే అలవాటు లేదు. ఎర్రన్నాయుడి సాక్షిగా చెబుతున్నా. నీ దిక్కున్నది చేసుకో. నీ దగ్గరే ఫైల్స్ అన్నీ ఉన్నాయి. నా పాలన ఎలా ఉందో మొత్తం వ్యవహారం అంతా నీ దగ్గరే ఉంది. మనుషుల మనోభావాలు దెబ్బతీస్తే జడిసే కుటుంబం మాది కాదు. అచ్చెన్నాయుడు అసలు భయపడడు.’ అని అచ్చెన్నాయుడు అన్నారు. ఎర్రన్నాయుడి జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళి మండలం నిమ్మాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందన్నారు.

అంతకు ముందు ఎర్రన్నాయుడి జయంతి సందర్భంగా ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గుర్తు చేసుకున్నారు.  ‘ఉత్తరాంధ్ర ప్రజలనే కాదు, ఎన్టీఆర్ ను సైతం ఆకర్షించిన వ్యక్తిత్వం స్వర్గీయ ఎర్రన్నాయుడుగారిది. మూడు దశాబ్దాలకు మించిన రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్రను సొంతం చేసుకున్న నా ఆత్మీయ నేస్తం ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆ ప్రజానాయకుని సేవలను స్మరించుకుందాం’ అని ట్వీట్ చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Esi scam, Kinjarapu Atchannaidu

ఉత్తమ కథలు