అచ్చెన్నాయుడి చేతికి ఏపీ టీడీపీ పగ్గాలు.. పార్టీ కమిటీలను ప్రకటించిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ కమిటీలను ప్రకటించాడు. ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు కింజారపు అచ్చెన్నాయుడిని నియమించారు.

news18-telugu
Updated: October 19, 2020, 6:49 PM IST
అచ్చెన్నాయుడి చేతికి ఏపీ టీడీపీ పగ్గాలు.. పార్టీ కమిటీలను ప్రకటించిన చంద్రబాబు
అచ్చన్నాయుడు (ఫైల్ ఫోటో)
  • Share this:
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ కమిటీలను ప్రకటించాడు. ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు కింజారపు అచ్చెన్నాయుడిని నియమించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణను రెండోసారి కొనసాగిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అలాగే 27 మందితో టీడీపీ సెంట్రల్ కమిటీ, 25 మందితో టీడీపీ పొలిట్ బ్యూరో ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. 31 మంది సభ్యులతో తెలంగాణ టీడీపీ కమిటీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. టీటీడీపీ సమన్వయ కమిటీలో ఆరుగురు సభ్యులను నియమించారు.

టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు కొనసాగనుండగా, పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా సీనియర్ నేతలు ప్రతిభా భారతి, కాశీనాథ్, గల్లా అరుణ, సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావును నియమించారు. పొలిట్ బ్యూరో బాధ్యతల నుంచి తప్పుకున్న గల్లా అరుణకుమారికి ఈసారి సెంట్రల్ కమిటీలో చోటు కల్పించడం విశేషం. ఆమె కుమారుడు, ఎంపీ గల్లా జయదేవ్‌కు పొలిట్ బ్యూరో సభ్యునిగా నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేష్, వర్ల రామయ్య, రామ్మోహన్‌నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్‌రెడ్డి, నర్సింహులు, కంభంపాటి రామ్మోహన్‌రావును నిమించారు. పొలిట్ బ్యూరో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, అశోక్‌గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, బాలకృష్ణ, వర్ల రామయ్య, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బొండా ఉమా, ఫారూక్, గల్లా జయదేవ్, రెడ్డప్పగారి శ్రీనివాస్‌రెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రావుల, అరవింద్‌కుమార్‌గౌడ్‌ను నియమించారు. పొలిట్ బ్యూరో సభ్యులుగా నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, ఎల్.రమణ కూడా కొనసాగనున్నారు.జాతీయ టీడీపీ అధికార ప్రతినిధులుగా దీపక్‌రెడ్డి, పట్టాభి రామ్, నసీర్, ప్రేమ్‌కుమార్, జోత్స్న, నన్నూరి నర్సిరెడ్డి, అశోక్‌బాబు అవకాశం కల్పించారు. టీడీపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా బచ్చుల అర్జునుడు, క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా మునిరత్నం, జీ నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించారు. కోశాధికారిగా శ్రీరాం రాజగోపాల్ తాతయ్య నియమించారు.
Published by: Sumanth Kanukula
First published: October 19, 2020, 5:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading