ఏపీ అసెంబ్లీలో సీటు వివాదం.. అచ్చెన్నాయుడు స్థానంలోకి బుచ్చయ్య చౌదరి

ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు పక్క సీటులో అచ్చెన్నాయుడు కూర్చోవడంపై అధికార పక్షం వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లింది.

news18-telugu
Updated: July 17, 2019, 4:44 PM IST
ఏపీ అసెంబ్లీలో సీటు వివాదం.. అచ్చెన్నాయుడు స్థానంలోకి బుచ్చయ్య చౌదరి
బుచ్చయ్య చౌదరి,అచ్చెన్నాయుడు
  • Share this:
ఏపీ అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ మధ్య సీటు వివాదం తలెత్తింది. ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు పక్క సీటులో అచ్చెన్నాయుడు కూర్చోవడంపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎవరికి కేటాయించిన సీట్లలో వారే కూర్చోవాలని అధికార పార్టీ సభ్యులు, మంత్రి బుగ్గన టీడీపీకి సూచించారు. ఈ క్రమంలోనే మంత్రి బుగ్గన చేసిన పలు వ్యాఖ్యలు చంద్రబాబుకు కోపం తెప్పించాయి. దీంతో ఆయన మంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి బుగ్గన... బుచ్చయ్య చౌదరికి కేటాయించిన సీటులో అచ్చెన్నాయుడు కూర్చోవడం సరికాదని అన్నారు.

గతంలో యనమల రామకృష్ణుడు కూడా తాము ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సీటు విషయాన్ని ప్రస్తావించారని గుర్తుచేశారు. దీనిపై ప్రతిపక్షం కావాలంటే స్పీకర్‌కు విజ్ఞప్తి చేసుకోవాలని సూచించారు. అయితే ప్రతిపక్ష నాయకుడి విన్నపాన్ని తాను పరిశీలిస్తానని చెప్పిన స్పీకర్ తమ్మినేని... అచ్చెన్నాయుడును వెనకి సీటులోకి వెళ్లి బుచ్చయ్య చౌదరిని చంద్రబాబు పక్క సీటులోకి రావాలని సూచించారు. స్పీకర్ చెప్పిన విధంగా అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి ఎవరి సీటులో వాళ్లు కూర్చుకోవడంతో వివాదం సద్దుమణిగింది.First published: July 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>