ఏపీలో సంకీర్ణమే... గ్రహాలు అలా ఉన్నాయి... పవన్ మద్దతు అవసరమే...

AP Assembly Election Results : నేతలు ఒకటి తలిస్తే... గ్రహాలు మరోలా పనిచేస్తున్నాయా... ఈసారి అటు కేంద్రంలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షాల మద్దతుతోనే ప్రభుత్వాలు ఏర్పాటవుతాయని గ్రహాలు చెబుతున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: May 22, 2019, 6:27 AM IST
ఏపీలో సంకీర్ణమే... గ్రహాలు అలా ఉన్నాయి... పవన్ మద్దతు అవసరమే...
జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ (File)
Krishna Kumar N | news18-telugu
Updated: May 22, 2019, 6:27 AM IST
జ్యోతిష్యాన్నీ, గ్రహాలనూ చాలా మంది నమ్మరు. అయినప్పటికీ అసలు అవేం చెబుతున్నాయో సరదాగా తెలుసుకుందామన్న ఆసక్తి మాత్రం చాలా మందికి ఉంటుంది. ఎన్నికల ఫలితాలు రావడానికి మనం రేపటి వరకూ వెయిట్ చెయ్యకుండా... ఈలోపు గ్రహాలు ఎలా ఉన్నాయో, వాటి ద్వారా ఎవరు అధికారంలోకి రాబోతున్నారో తెలుసుకుందాం. ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మనం చూశాం. అప్పటికే ఓ అంచనాకి వచ్చినా, ఏపీలోని అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండు పార్టీలూ తామే అధికారంలోకి వస్తామని చెబుతున్నాయి. సొంతంగానే మెజార్టీ సాధించుకుంటామని అంటుంటే, గ్రహాలు మాత్రం అంత సీన్ లేదంటున్నాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా, ఇతర పార్టీల మద్దతు కావాల్సిందే అని హెచ్చరిస్తున్నాయి.

ఎగ్జిట్ పోల్స్‌ని చూసిన జ్యోతిష్య పండితులకు ఒళ్లు మండింది. అవి పూర్తిగా అబద్ధాలు చెబుతున్నాయని ఫైర్ అయ్యారు ఢిల్లీలో జ్యోతిష్య శాస్త్రంలో గోల్డ్ మెడల్ కొట్టిన శైలేంద్ర శర్మ. ఏప్రిల్ 11 నుంచీ మే 19 వరకూ ఎన్నికలు జరిగిన 7 దశలూ చూస్తే... గ్రహాలు ఏ పార్టీకీ అనుకూలంగా లేవని ఆయన అంటున్నారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఎవరైనా సరే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచెయ్యలేరని తేల్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌కి ప్రధాని అయ్యే భాగ్యం లేదట. NDA పక్షాలన్నీ కలిసినా మేజిక్ ఫిగర్ (272) రాదట. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ లేదా వైసీపీ మద్దతు తప్పనిసరి అంటున్నారు.

ఏపీలో హంగే కింగ్ : ఎగ్జిట్ పోల్స్ ఫలితాలేమన్నాయి... వైసీపీ అధికారంలోకి వస్తుందని కొన్నీ, కాదు టీడీపీ వస్తుందని కొన్నీ చెప్పాయి కదా. జ్యోతిష్య పండితులు మాత్రం రెండు పార్టీలకూ సొంతంగా మెజార్టీ (88) స్థానాలు రావని అంటున్నారు.

జనసేన మద్దతు తప్పనిసరి : ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పినట్లు జనసేన మరీ అంత వీక్‌గా ఏమీ లేదట. దాని ప్రభావం ఉందట. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా జనసేన మద్దతు తప్పనిసరి అంటున్నారు జ్యోతిష్య పండితులు.ప్రధానంగా కొందరు చెబుతున్నట్లుగా కాపు వర్గానికి సంబంధించిన పార్టీ జనసేన దాదాపు 70 అసెంబ్లీ స్థానాలపై తన ప్రభావం చూపించగలదంటున్నారు జ్యోతిష్యులు. ఆ 70లో ప్రతీ అసెంబ్లీ స్థానంలో 40 నుంచీ 90 వేల మంది కాపులు ఉన్నారనీ వాళ్లు జనసేనవైపు మొగ్గే అవకాశం ఉందని అంటున్నారు.

గ్రహాల దిశ, పరిణామాలను బట్టీ చూస్తే... జనసేన మద్దతు అవసరం అంటున్నారు విశ్లేషకులు. ఈ విషయంలో ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా తప్పయ్యాయని చెబుతున్నారు. సరే, ఎవరు రైటో, ఎవరు రాంగో రేపు మనకు తెలుస్తుంది. అప్పటిదాకా ఓపిక పడదాం.

ఇవి కూడా చదవండి :
Loading...
ఇస్రో మరో విజయం... నింగిలోకి రీశాట్-2బీ... సరిహద్దులపై రాడార్ నిఘా...

Photos : అమాయక చూపులతో కట్టిపడేస్తున్న ముంబై బ్యూటీ...

జబర్దస్త్ రష్మి లాగా కనిపించే కేరళ బ్యూటీ ఫొటోస్...
First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...