బాబు ఇంటికి భలే వాస్తు.. మళ్లీ ఆయనే సీఎం అంటున్న జ్యోతిష్యులు

హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు ఇంటికి అద్భుతమైన వాస్తు ఉందని అందుకే ఆయనే మరోసారి సీఎం అవుతారన్నారు సిద్ధాంతి.

news18-telugu
Updated: April 15, 2019, 12:45 PM IST
బాబు ఇంటికి భలే వాస్తు.. మళ్లీ ఆయనే సీఎం అంటున్న జ్యోతిష్యులు
చంద్రబాబు నాయుడు
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. ఇప్పుడు ఫలితాల వంతు. అన్నిపార్టీలు గెలుపోటములపై  లెక్కలేసుకుంటున్నారు. ఎవరు విజయం సాధిస్తారో...? ఎవరు ఓటమి పాలవుతారోనని ? టెన్షల్ ఉన్నారు. అయితే ఏదీ తేలాలన్న కూడా మే 23వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఎన్నికల ఫలితాలు అప్పుడే వస్తాయి కాబట్టి. అయితే సందట్లో సడేమియా అన్నట్లు.. జ్యోతిష్యులు కూడా ఎన్నికల వేళ సందడి చేస్తున్నారు. వాస్తులు, దోషాలు అంటూ వార్తల్లో నిలుస్తున్నారు. మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారంటూ కొమ్మినేని మల్లేశ్వరరావు సిద్ధాంతి జోస్యం చెప్పారు. బాబు ఇంటికి భలే వాస్తు ఉందన్నారాయన. హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు ఇంటికి అద్భుతమైన వాస్తు ఉందని అందుకే ఆయనే మరోసారి సీఎం అవుతారన్నారు. అంతేకాదు... నారా లోకేష్ కూడా ఈసారి ఎన్నికల్లో గెలిచి తీరుతారన్నారు కొమ్మినేని సిద్ధంతి.

నాదెండ్ల భాస్కర్‌రావుకు వాస్తు దోషం ఉండటం వల్ల ఆయన ఎక్కువరోజులు సీఎంగా కొనసాగలేకపోయారన్నారు. ఎన్నిసీట్లు వస్తాయనేది చెప్పలేం కానీ.. ఖచ్చితంగా 2019లో మరోసారి చంద్రబాబే సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ఆయన ఎన్నో విషయాల పట్ల పరిశోదనలు చేశానన్నారు. గత 25ఏళ్లుగా వాస్తుపై ఆయన పరిశోధనలు చేశానన్నారు కొమ్మినేని సిద్ధాంతం. గతంలో కూడా ఆయన చంద్రబాబు గెలుపోటముల్ని పరిశీలించానన్నారు. వందకు వంద శాతం బాబే సీఎం అవుతారన్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: April 15, 2019, 12:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading