సభలో సీట్ల రగడ... బెదిరించొద్దంటూ చంద్రబాబుపై స్పీకర్ ఫైర్

స్పీకర్ తమ్మినేని టీడీపీ నేతలపై మండిపడ్డారు. మీరు చెప్పినట్లు ఇక్కడ సభ నడవాలా అంటూ ఫైర్ అయ్యారు.

news18-telugu
Updated: July 17, 2019, 10:28 AM IST
సభలో సీట్ల రగడ... బెదిరించొద్దంటూ చంద్రబాబుపై స్పీకర్ ఫైర్
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం
news18-telugu
Updated: July 17, 2019, 10:28 AM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ రోజు ప్రారంభమైన సమావేశాల్లో సీట్ల కేటాయింపుపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు జరిగాయి. అచ్చెన్నాయుడికి సీటు కేటాయింపుపై టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సభా సంప్రదాయాలు పాటించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. డిప్యూటీ లీడర్లకు ప్రత్యేక సీట్లు కేటాయించాలన్నారు. దీంతో స్పందించిన స్పీకర్ తమ్మినేని టీడీపీ నేతలపై మండిపడ్డారు. మీరు చెప్పినట్లు ఇక్కడ సభ నడవాలా అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు గారూ బెదిరించొద్దు అంటూ తమ్మినేని ప్రతిపక్ష నేతపై సీరియస్ అయ్యారు.

స్పీకర్ గట్టిగా మాట్లాడంతో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వుయ్ వాంట్ జస్టీస్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కల్పించుకున్న అధికారపార్టీ సభ్యులు నిబంధనల ప్రకారమే సీట్లు కేటాయించామన్నారు. ప్రశ్నపై సమాధానం ముగిశాక తర్వాత ఎలా అవకాశం ఇస్తారని ఆనం ప్రశ్నించారు. గతంలో మీరేం సభా సంప్రదాయాలు పాటించారని అంబటి రాంబాబు... టీడీపీని ప్రశ్నించారు. గతంలో రోజాపై ఏడాదిపాటు ఎలా సస్పెన్షన్ వేటు వేశారు అంటూ నిలదీశారు.  శాసనసభ చరిత్రలోనే ఏ ఎమ్మెల్యేను ఏడాదిపాటు బహిష్కరించిన సంఘటన ఉందా అంటూ అంబటి ప్రశ్నించారు.

First published: July 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...