Five State Elections: భారత దేశంలో ఎట్టకేలకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రస్తుతం జరిగిన ఎన్నికలను ( Assembly Elections) రాబోయే సార్వత్రిక ఎన్నికలు సెమిఫైనల్ వీటిని విశ్లేషిస్తున్నారు . దీనిలో భాగంగా, కేంద్ర ఎన్నికల సంఘం.. ఈ ఏడాది ఆరంభంలో జనవరి 8న ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ను విడుదల చేసింది.
ఐదు రాష్ట్రాల్లోని 690 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఇందులో భాగంగా, గోవా 40, పంజాబ్ లో 117, యూపీలో 403, మణిపూర్ లో 60, ఉత్తరాఖండ్ లోని 70 కు ఎన్నికలు జరిగాయి. వీటికి ఏడు దశల్లో ఎన్నికల, ఈసీ అధికారులు ఎన్నికలను నిర్వహించారు. కొన్ని చోట్ల పలు అనివార్య కారణాల వలన పోలింగ్ తేదిలను మార్చాల్సి వచ్చింది.
ఓటర్లు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, ఈసీ సుశీల్ చంద్ర (Sushil Chandra).. ఎన్నికల నిర్వహణ కోసం పకట్భందిగా చర్యలు తీసుకున్నారు.ఈ ఎన్నికలలో 2.16 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
దీనిలో భాగంగా యూపీ(Uttarpradesh )లో జనవరి 14న నోటిఫికేషన్ ను విడుదల చేసింది. యూపీలో ఫిబ్రవరి 10 న తొలిదశ పోలింగ్ జరిగింది.మొత్తం ఐదు రాష్ట్రాలలో ఏడు దశలలో ఎన్నికలను నిర్వహించారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో పోలింగ్ విజయవంతంగా పూర్తయింది.
ఉత్తరప్రదేశ్‌కు మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. పంజాబ్, ఉత్తరాఖండ్,గోవాకు ఫిబ్రవరి 14న ఒకే దశలో పోలింగ్ జరగాయి. ఇక మణిపూర్ రాష్ట్రానికి ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మార్చి 10న కౌంటింగ్ చేపట్టి ఈసీ ఫలితాలను ప్రకటించినుంది.
ఉత్తర ప్రదేశ్:
ఉత్తర ప్రదేశ్ (Uttar pradesh Assembly Elections 2022) లో ఎన్నికలు మోదీ సర్కారు కీలకంగా తీసుకుంది. ఇక్కడ ఏడు విడతలలో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీల మధ్య త్రిముఖ పోటి నెలకొందని భావించవచ్చు . ఆయా పార్టీలు కూడా నువ్వానేనా అన్నరీతిలో ప్రచారం నిర్వహించాయి. కులాలు, వర్గాలు వారిగా ఓట్లను రాబట్టడానికి నాయకులు ప్రచారం నిర్వహించారు. యోగి సర్కారు ఈ ఎన్నికలను ప్రతి ష్టాత్మకంగా తీసుకుంది.
ఆయా పార్టీల నుంచి వలసలు జోరుగా కొనసాగాయి. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీలు మారారు. ప్రధానంగా యూపీలో కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ పార్టీ మారడం నుంచి వలసలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు.ఫిబ్రవరి 10న తొలివిడత ఎన్నికలు జరిగాయి. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) గోరఖ్ పూర్ నుంచి పోటీలో నిలిచారు.ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ బరిలో దిగారు.మెయిన్‌పురి జిల్లాలోని కర్హల్ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు.
యూపీ తొలి దశలో.. 11 జిల్లాల పరిధిలోని మొత్తం 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. దాదాపు 59 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో 60.69 శాతం ఓటింగ్ నమోదైంది. యూపీలో మూడో దశలో 60.69 శాతం పోలింగ్ నమోదైంది. యూపీలో ముగిసిన నాలుగో దశలో 61.65 శాతం పోలింగ్ నమోదయ్యింది.
యూపీలోని 9 జిల్లాలలో 59 నియోజక వర్గాలలో ఎన్నికలు జరిగాయి.దీనిలో 61.64 శాతం పోలింగ్ నమోదైంది.అదే విధంగా ఐదో దశలో.. 12 జిల్లాలలోని 61 నియోజక వర్గాలలో ఎన్నికలు జరిగాయి.దీనిలో 53.98 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ (Elections Commission) వెల్లడించింది. యూపీలో ఆరో దశలో 57 స్థానాల్లో 55.79శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ అధికారులు వెల్లడించారు.
పంజాబ్:
పంజాబ్ (Punjab)అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20కి వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న జరగాల్సిన ఎన్నికలను పంజాబ్ సీఎం చన్నీ, ఇతర రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. గురు రవిదాస్ జయంతి వేడుకల దృష్ట్యా అసెంబ్లీ ఎన్నికలను(Assembly Election 2022) ఫిబ్రవరి 20 వరకు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఒకే దశలో ఎన్నికలు జరిగాయి.
కొత్త షెడ్యూల్ ప్రకారం.. జనవరి 25న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్లకు ఫిబ్రవరి 1 తుది గడువు, నామినేషన్ల పరిశీలనకు తుది గడువు ఫిబ్రవరి 2, నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు ఫిబ్రవరి 4, ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 20న, ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది.
పంజాబ్ లో (Punjab Assembly Elections 2022) ఈ సారి బహుముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), బీజేపీ కూటమి ల మధ్య పోటీ నెలకొంది. ఈ ఎన్నికలలో 63.44 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.పంజాబ్ సీఎం చన్నీ, నవజ్యోత్ సింగ్ సిద్దూ తదతరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్, ఆప్, పంజాబ్ లోక్ కాంగ్రెస్ ల మధ్య బహుముఖ పోటి నెలకొంది.
ఉత్తరఖండ్:
ఉత్తరాఖండ్ (Uttarakhand) ప్రధానంగా పర్యాటకంపై ఆధారపడ్డ రాష్ట్రం.దేవ భూమి ఉత్తర ఖండ్ లో 70 నియోజక వర్గాలు ఉన్నాయి. దీనిలో ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఉత్తర ఖండ్ (Assembly Elections 2022) 59.37 శాతం ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక్కడ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటి నెలకొంది. బీజేపీకి ఇప్పటికే ముగ్గురు సీఎంలను మార్చింది. దీంతో ఇక్కడ బీజేపీ మరొసారి అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది.
గోవా:
గోవా లో (Goa) ఒకే దశలో ఎన్నికలను ఫిబ్రవరి 14 ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా..79.29 శాతం పోలింగ్ నమోదైంది. గోవాలో (Goa assembly Elections 2022) బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య గట్టిపోటి నెలకొంది.
మణిపూర్:
మణిపూర్ (Manipur) లో మొత్తం 60 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ రెండు విడతలో ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. తొలుత..ఫిబ్రవరి 27 , మార్చి3న ఎన్నికలు జరగాల్సి ఉండగా.. వాటిని ఫిబ్రవరి 28, మార్చి 5న ఎన్నికల షెడ్యూల్ మార్చింది. మణిపూర్ (Manipur Assembly elections 2022) తొలివిడత అసెంబ్లీ ఎన్నికలలో పలు ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఈ క్రమంలో.. తొలివిడతలో రికార్డు స్థాయిలో 78.03 శాతం ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం (Central Elections Commission)వెల్లడించింది. ఎన్నికలకు ముందు, తర్వాత కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఇక మార్చి 5న జరిగిన రెండో విడత ఎన్నికలలో 76 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.
Tags: 5 State Elections, Assembly Election 2022, Goa Assembly Elections 2022, Punjab Assembly Elections 2022, Uttar Pradesh Assembly Elections, Uttarakhand Assembly elections 2022