Home /News /politics /

ASSEMBLY ELECTION RESULTS 2022 LIVE UPDATES UTTRA KHAND PUNJAB UTTAR PRADESH MANIPUR AND GOA COUNTING LEADERS OFFERING PRAYERS PAH

Manipur, Goa, Uttarakhand: అసెంబ్లీ ఎన్నికలు.. గోవాలో మారుతున్న రాజకీయ పరిణామాలు...

కేంద్ర ఎన్నికల సంఘం

కేంద్ర ఎన్నికల సంఘం

Five State Elections: భారత దేశంలో మినిసంగ్రామంగా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రస్తుతం జరిగిన ఆయా రాష్ట్రాలలో పార్టీల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వీటిని ( Assembly Elections) రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమిఫైనల్ భావించారు .

ఇంకా చదవండి ...
Manipur, Goa, Uttarakhand: భారత దేశంలో మినిసంగ్రామంగా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రస్తుతం జరిగిన ఆయా రాష్ట్రాలలో పార్టీల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వీటిని ( Assembly Elections) రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమిఫైనల్ భావించారు .

ఎట్టకేలకు మినిసంగ్రామం ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం.. ఈ ఏడాది ఆరంభంలో జనవరి 8న ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ను విడుదల చేసింది.
ఐదు రాష్ట్రాల్లోని 690 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఇందులో భాగంగా, గోవా 40, పంజాబ్ లో 117, యూపీలో 403, మణిపూర్ లో 60, ఉత్తరాఖండ్ లోని 70 కు ఎన్నికలు జరిగాయి.

ఓటర్లు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, ఈసీ సుశీల్ చంద్ర (Sushil Chandra).. ఎన్నికల నిర్వహణ కోసం పకట్భందిగా చర్యలు తీసుకున్నారు.ఈ ఎన్నికలలో 2.16 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఉత్తరఖండ్:  దేవభూమి ఉత్తర ఖండ్ లో బీజేపీ , కాంగ్రెస్ లు నువ్వా నేనా రీతిలో తలపడ్డాయి. ప్రతి సారి ఇక్కడ ప్రతి ఏడాది, ఒక ప్రభుత్వం ఏర్పడుతు వస్తుంది. ఒక సారి కాంగ్రెస్ గెలిస్తే మరోసారి బీజేపీ ఇలా.. సంప్రదాయం కొనసాగుతుంది. 2017 లో బీజేపీ అధికారంలో వచ్చింది . కానీ ముగ్గురు సీఎంలను మార్చాల్సి వచ్చింది. ఇక ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 31.

అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని పలు సర్వేలు ఇప్పటికే వెల్లడించాయి. ఉత్తరాఖండ్‌ (Uttarakhand) ప్రధానంగా పర్యాటకంపై ఆధారపడ్డ రాష్ట్రం. దేవ భూమి ఉత్తర ఖండ్ లో 70 నియోజక వర్గాలు ఉన్నాయి. దీనిలో ఒకే విడతలో పోలింగ్ జరిగింది.

ఉత్తర ఖండ్ (Assembly Elections 2022) 59.37 శాతం ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 36. ఇక్కడ మరోసారి కమల దళం అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని పలు సర్వేలు వెల్లడించాయి. పుష్కర్ సింగ్ ధామి అతి పిన్న వయసులో సీఎంగా అయిన విషయం తెలిసిందే.

మణిపుర్: ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
మణిపూర్ (Manipur) లో మొత్తం 60 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఈసీ రెండు విడతలో ఎన్నికలను నిర్వహించారు. ఇక మార్చి 5న జరిగిన రెండో విడత ఎన్నికలలో 76 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.

ఇక ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 31. అభ్యర్థుల భవితవ్యం బాక్సులలో ఉంది. ఈసారి బీజేపీ అధికారంలోకి రావాలని మణిపుర్ సీఎం.. ఎన్ బీరెన్ సింగ్ ఇంఫాల్ లోని శ్రీ గోవిందాజీ ఆలయం లో ప్రత్యే క పూజలు నిర్వహించారు. ఇక ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 31. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని పలు సర్వేలు ఇప్పటికే వెల్లడించాయి.

గోవా: గోవాలో హంగ్ ఏర్పడుతుందని పలు సర్వేలు వెల్లడించాయి. దీంతో ఇక్కడ రాజకీయాలు హీట్ ను పుట్టిస్తున్నాయి. కౌంటింగ్ ప్రారంభమైంది. గోవా సీఎం వెనుకంజలో ఉన్నారు. కాగా, గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ వెనుకంజలో కొనసాగుతున్నారు.

ఇక గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ శ్రీ దత్త స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తమను గెలిపించాలిన దేవుడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఇప్పటికే ఆయా పార్టీల నేతల గోవాలో వాలిపోయారు. గోవా లో (Goa) ఒకే దశలో ఫిబ్రవరి 14 ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా.. 79.29 శాతం పోలింగ్ నమోదైంది. గోవాలో (Goa assembly Elections 2022) బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య గట్టిపోటి నెలకొంది. అయితే, 2017 లో జరిగిన తప్పులను పునారావ్రుతం కాకుండా కాంగ్రెస్ చర్యలు చేపట్టింది.

2017 అసెంబ్లీ ఎన్నికలలో 40 స్థానాలున్న గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 21 మంది సంఖ్యబలం ఉండాలి.గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఇప్పటికే సీఎం మోదీని కలిశారు. ఇండియా టుడే, ఏబీపీ, సీఓటర్ పలు సర్వేలు.. బీజేపీకే పట్టం కట్టాయి. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ పార్టీమారమని ఒట్టువేసుకుంటూ ఈ విషయంలో కొత్త సంప్రదాయానికి తెర తీశారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Assembly Election 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు