ASSEMBLY ELECTION RESULTS 2022 LIVE UPDATES UTTARAKHAND MANIPUR PAH
Assembly Election 2022: పూర్తి ఫలితాలు వెలువడలేదు.. మణిపుర్, ఉత్తరఖండ్ లో ఊహించని ట్విస్ట్ లు...
ప్రతీకాత్మక చిత్రం
Assembly Election 2022: దేశంలో ప్రస్తుతం బీజేపీ హవా కొనసాగుతుంది. అయితే, అన్ని ఎగ్జిట్ పోల్స్ దాదాపు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని తెలిపాయి. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, గోవాలో బీజేపీ విజయం సాధించింది. ఇక మరో రెండు రెండు రాష్ట్రాలలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అదేంటంటే..
Assembly Election 2022: దేశంలో ప్రస్తుతం బీజేపీ హవా కొనసాగుతుంది. అయితే, అన్ని ఎగ్జిట్ పోల్స్ దాదాపు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని తెలిపాయి. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, గోవాలో బీజేపీ విజయం సాధించింది. ఇక మరో రెండు రాష్ట్రాలలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే..
ప్రస్తుతం జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమిఫైనల్ గా భావించారు . పలు రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హోరహోరీగా ప్రచారాలు నిర్వహించాయి. అయితే.. ఉత్తర ప్రదేశ్ , గోవాలలో ప్రజలు.. బీజేపీకి భారీ మెజార్టీతో విజయం అందించారు. అయితే, బీజేపీకి ఉత్తరఖండ్ లో ఊహించని సంఘటన ఎదురైంది.
ఉత్తర ఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓటమి పాలయ్యారు. దాదాపు 6 వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు. అయితే, బీజేపీ పూర్తి ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికి ప్రస్తుతం ఈ వార్త కార్యకర్తలలో తీవ్ర నిరాశమిగిల్చింది. ఇక మణిపుర్ లో బీజేపీ సీఎం బీరెన్ సింగ్ విజయం సాధించారు. దాదాపు 17 వేల ఓట్ల మెజారీటితో హీంగాంగ్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ ప్రత్యర్థి అయిన.. శరత్ చంద్ర సింగ్ పై విజయం సాధించారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.