Home /News /politics /

ASSEMBLY ELECTION RESULTS 2022 LIVE UPDATES UTTARAKHAND MANIPUR GOA PAH

Goa, Uttara khand, Manipur: చిన్న రాష్ట్రాలలో కొనసాగుతున్న మోదీ ప్రభంజనం..

కేంద్ర ఎన్నికల సంఘం

కేంద్ర ఎన్నికల సంఘం

Goa,Uttara khand, Manipur: దేశంలో మరోసారి బీజేపీ ప్రభంజనం కొనసాగుతుంది. ఐదురాష్టాల ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటలలో ఈసీ అధికారికంగా వెల్లడించనుంది. దాదాపు అన్ని చోట్ల..

    Goa,Uttara khand, Manipur: దేశంలో మరోసారి బీజేపీ ప్రభంజనం కొనసాగుతుంది. ఐదురాష్టాల ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటలలో ఈసీ అధికారికంగా వెల్లడించనుంది. దాదాపు అన్ని చోట్ల..

    ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్థాత్మకంగా తీసుకుంది. దీన్ని.. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమిఫైనల్ గా భావించాయి. యూపీలో భారతీయ పార్టీ.. ఆధీక్యంలో కొనసాగుతుంది.  అదే విధంగా మణిపుర్, ఉత్తరఖండ్, గోవా లలో బీజేపీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. ఎగ్జిట్ పోల్స్ సైతం.. ఎన్నికలు జరిగిన మెజారిటీ రాష్ట్రాలలో బీజేపీ తిరిగి ప్రభుత్వాన్నిఏర్పాటు చేస్తుందని తెలిపాయి. ప్రస్తుతం ఆయా చోట్ల కౌంటింగ్ కొనసాగుతుంది.

    ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఉత్తరఖండ్ లో  మ్యాజిక్ ఫిగర్ 36. ఇప్పటికే బీజేపీ 45 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 21 సీట్లను సాధించింది. ఇక మణిపుర్ లో బీజేపీ 23,కాంగ్రెస్ 6 స్థానాలను గెలిచింది. ఇక గోవాలో బీజేపీ 18, కాంగ్రెస్ 13 స్థానాలను సాధించాయి. ఉత్తరాఖండ్‌ (Uttarakhand) ప్రధానంగా పర్యాటకంపై ఆధారపడ్డ రాష్ట్రం.

    దేవ భూమి ఉత్తర ఖండ్ లో 70 నియోజక వర్గాలు ఉన్నాయి. దీనిలో ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఇక్కడ మరోసారి కమల దళం అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని పలు సర్వేలు వెల్లడించాయి. పుష్కర్ సింగ్ ధామి అతి పిన్న వయసులో సీఎం అయ్యారు. ఇక గోవాలో.. (Goa) ఒకే దశలో ఫిబ్రవరి 14 ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

    బీజేపీ, కాంగ్రెస్ ల (Assembly elections)మధ్య గట్టిపోటి నెలకొంది. గోవాలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది. ఇప్పటికే పలు ఎగ్జిట్ పోల్ సర్వేలలో హంగ్ ఏర్పడుతుందని పలు సర్వేలు వెల్లడించాయి. అయితే, 2017 లో జరిగిన తప్పులను పునారావ్రుతం కాకుండా కాంగ్రెస్ చర్యలు చేపట్టింది.

    ఇప్పటికే కాంగ్రెస్, ఆప్ అభ్యర్థులు తమ అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఇక మణిపుర్ లో.. బీజేపీ హవా కొనసాగుతుంది. మణిపూర్ (Manipur) లో మొత్తం 60 అసెంబ్లీ సీట్లు (Assembly elections) ఉన్నాయి. ఇక్కడ రెండు విడతలలో ఎన్నికలు జరిగాయి.

    ఇక్కడో కూడా బీజేపీ ప్రభంజం కొనసాగుతుంది. మణిపుర్ ప్రభుత్వం ను ఏర్పాటు చేయాలంటే.. పార్టీలు.. 31 మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవాలి. ఇక సర్వేలన్ని బీజేపీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వెల్లడించాయి.
    Published by:Paresh Inamdar
    First published:

    Tags: Assembly Election 2022, Goa Assembly Elections 2022, Manipur Assembly elections 2022, Uttarakhand Assembly elections 2022

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు