UP Election Result 2022 in Telugu | యూపీలో అత్యధిక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరోసారి బీజేపీనే వస్తుందని లెక్కించాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ లో కూడా బీజేపీ సునాయాసంగా మ్యాజిక్ మార్క్ 202 దాటుతుందని అంచనా వేశాయి. రెండోసారి యోగి ఆదిత్యనాథ్ సీఎం కావడం ఖాయమని ఢంకా భజాయించాయి.
Uttar Pradesh assembly election 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాసేపట్లో తేలనున్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఏయే పార్టీలు అధికారంలోకి రానున్నాయి? ఇప్పుడు పవర్లో ఉన్న పార్టీలకే ప్రజలు పట్టం కట్టారా? లేకపోతే కొత్త వారికి అధికారాన్ని అందించాలని ప్రజలు నిర్ణయించారా అనేది కాసేపట్లో కౌంటింగ్ ద్వారా తేలనుంది. ఈ క్రమంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి? ముఖ్యంగా అందరి దృష్టి ఎక్కువగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఏయే ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో చూద్దాం. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీదే అధికారం అని దాదాపు అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.
పీ -మార్క్ సర్వే (P-Mark Survey )
పీ -మార్క్ సర్వే ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీయే మళ్లీ అధికారం చేపడుతుంది. కమల పార్టీ కూటమికి 240 సీట్లు వస్తాయి. సమాజ్‌వాదీ పార్టీ 140 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. బీఎస్పీ, కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి. బీఎస్పీకి 17, కాంగ్రెస్‌కు 4 సీట్లు వచ్చే అవకాశముంది. గతంలో పోల్చితే బీజేపీకి సీట్లు బాగా తగ్గినా.. మళ్లీ ఆ పార్టీదే అధికారమని పీ-మార్క్ సర్వే అభిప్రాయపడింది.
న్యూస్ ఎక్స్ -పోల్‌స్ట్రాట్ ( Nesws x- PolStrat)
న్యూస్ ఎక్స్ -పోల్‌స్ట్రాట్ ఎగ్జిట్ పోల్స్ కూడా యూపీలో మళ్లీ బీజేపీయే గెలుస్తుందని అంచనా వేసింది. గతంలో పోల్చితే సీట్లు తగ్గుతాయని వెల్లడించింది. కమల దళానికి 211 నుంచి 255 సీట్లు వస్తాయని న్యూస్ ఎక్స్-పోల్‌స్ట్రాట్ తెలిపింది. సమాజ్‌వాదీ 146 నుంచి 160 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. బీఎస్పీ 14 నుంచి 24 సీట్లు వచ్చే అవకాశముంది. కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీకి 4- 6 స్థానాలు మాత్రమే దక్కే అవకాశముందని పేర్కొంది.
మ్యాట్రిజ్ పోల్ (Matrize-Poll)
మ్యాట్రిజ్ పోల్ కూడా బీజేపీ వైపే మొగ్గుచూపింది. బీజేపీ 211 నుంచి 225 సీట్లు సాధిస్తుందని మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. సమాజ్‌వాదీకి 146 నుంచి 160 సీట్లు దక్కే ఛాన్స్ ఉంది. బీఎస్పీ 14-24 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఇక కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయిందని..కేవలం 4-6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించవచ్చని మ్యాట్రిజ్ పోల్ పేర్కొంది.
ఈటీజీ రీసర్చ్ (ETG RESEARCH):
ఈటీజీ రీసర్చ్ సర్వే ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీకి 230 నుంచి 245 స్థానాలు వస్తాయి. సమాజ్‌వాదీ పార్టీ 150 నుంచి 165 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. బీఎస్పీ 5-10, కాంగ్రెస్ 2-6 సీట్లకు మాత్రమే పరిమితమవుతుంది. ఇతర పార్టీలు కూడా పెద్దగా ప్రభావం చూపలేదు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.