Assembly Election 2022: మణిపూర్ లోను బీజేపీ అఖండ విజయం.. పంజాబ్ తప్ప మిగతా అన్ని చోట్ల..
బీజేపీ జెండా
Manipur Assembly Elections: మణిపూర్ లోను భారతీయ జనతా పార్టీ విజయ దుంధుబి మోగించింది. నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు మరోసారి విజయం అందించారు. దీంతో వార్ వన్ సైడ్ గా మారిపోయింది.
Manipur Assembly Elections: మణిపూర్ లోను భారతీయ జనతా పార్టీ విజయ దుంధుబి మోగించింది. నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు మరోసారి విజయం అందించారు. ఎన్నికలు ఏవైన వార్ వన్ సైడ్ గా మారిపోయింది. కమల దళానికి ప్రజలలో ఉన్న ఆదరణ, విశ్వాసం మరొసారి స్పష్టంగా బయటపడ్డాయి. దీంతో ప్రజలు.. బీజేపీకి అఖండ విజయం అందించారు. కార్యకర్తలు ఆనందంతో మునిగిపోయారు. దేశమంతటా బీజేపీ.. సంబరాలు చేసుకుంటున్నారు. టపాకాయలు కాలుస్తున్నారు.
భారతీయ జనాతా పార్టీ దేశంలో హవాను కొనసాగిస్తుంది. ఐదురాష్ట్రాల ఎన్నికలలోను మోదీ తన చరిష్మాను చూపించారు. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, గోవా, ఉత్తరఖండ్ రాష్ట్రాలలో విజయ బావుటా ఎగురవేశారు. కాగా, మణిపూర్ (Manipur) లో మొత్తం 60 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఈసీ రెండు విడతలో ఎన్నికలను నిర్వహించింది.
ఇక్కడ జరిగిన ఎన్నికలలో పలు హింసత్మక సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ ను నువ్వా.. నేనా అన్నరీతిలో.. పోటిపడ్డాయి. ఇక ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 31. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ పావులు కదుపుతుంది. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని చెప్పిన సర్వేల అంచనాలు నిజమయ్యాయి. బీజేపీ.. సీఎం బీరెన్ సింగ్ మరొసారి అధికారపగ్గాలు చేపడతారని తెలుస్తోంది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.