ASSEMBLY ELECTION RESULTS 2022 LIVE UPDATES IN TELUGU BJP GOT MAJORITY IN UTTAR PRADESH UTTARAKHAND GOA MANIPUR BA
Assembly Election Results Live Updates: బీజేపీ ప్రభంజనం.. నాలుగు రాష్ట్రాల్లో ముందంజ.. పంజాబ్‌లో ఊడ్చేసిన ఆప్
యోగీ - మోదీ (ఫోటో క్రెడిట్ - ట్విట్టర్)
ఇప్పటి వరకు అందిన వివరాల మేరకు నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో కమలం వికసించింది. మణిపూర్ మినహా మిగిలిన మూడు చోట్ల లీడ్స్‌లో మేజిక్ ఫిగర్స్ కూడా దాటింది. మణిపూర్‌లో మేజిక్ ఫిగర్ వైపుగా దూసుకెళ్తోంది.
Uttar Pradesh Results Live | ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు అందిన వివరాల మేరకు నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో కమలం వికసించింది. మణిపూర్ మినహా మిగిలిన మూడు చోట్ల లీడ్స్‌లో మేజిక్ ఫిగర్స్ కూడా దాటింది. మణిపూర్‌లో మేజిక్ ఫిగర్ వైపుగా దూసుకెళ్తోంది.
ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ దుమ్మురేపుతోంది. ఇప్పటికే 202 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అంటే మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. సమాజ్‌వాదీ పార్టీ 83 చోట్ల లీడింగ్‌లో కొనసాగుతోంది. బీఎస్పీ 6, కాంగ్రెస్ 5 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఉత్తరాఖండ్‌లో బీజేపీ దూకుడు మొదలయింది. ఇప్పుడు 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవలేదు. మరో 2 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ముందుకున్నారు.
మణిపూర్‌లో కూడా బీజేపీ దూకుడు కొనసాగుతోంది. అక్కడ బీజేపీ 14 సీట్లలో ముందంజలో ఉంటే కాంగ్రెస్ పార్టీ కేవలం 6 సీట్లలో ఆధిక్యంలో ఉంది. గోవాలో కూడా బీజేపీనే ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ కూటమి 18 సీట్లలో ఆధిక్యంలో ఉంది. అయితే, కాంగ్రెస్ కూడా వెనుకెనుకే వస్తోంది. కాంగ్రెస్ కూటమి 14 సీట్లలో ముందంజలో ఉంది.
3 రాష్ట్రాల సీఎంల వెనకంజ
ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్ సీఎలు పుష్కర్ సింగ్ ధామి, ప్రమోద్ సావంత్, చరణ్‌జిత్ సింగ్ చన్నీ వెనుకంజలో ఉన్నారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో బీజేపీ మ్యాజిక్ మార్కుకు చేరువైంది. గోవాలో కూడా ఇతర పార్టీల కంటే ఆధిక్యంలో ఉంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.