Home /News /politics /

ASSEMBLY ELECTION RESULTS 2022 LIVE UPDATES GOA ELECTION COUNTING TODAY PAH

Goa Elections: గోవాలో ఆసక్తికరంగా మారిన రాజకీయాలు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Goa Election Updates: గోవాలో అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. ఇక్కడ 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తాజాగా..  కాంగ్రెస్ , బీజేపీలు నువ్వా ,నేనా అన్నరీతిలో..

Goa Election Updates: గోవాలో అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. ఇక్కడ 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తాజాగా..  కాంగ్రెస్ , బీజేపీలు..

గోవాలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 21. ప్రస్తుతం బీజేపీకి 19 సీట్లను , కాంగ్రెస్ కు 15 సీట్లు సాధించాయి.  టీఎంసీ రెండు స్థానాలను సాధించింది. అదే విధంగా గోవాలో ఎఎపీ ఒక స్థానంలోను, స్వతంత్రులు మూడు స్థానాలలో కొనసాగుతున్నారు. ఇక్కడ మరొసారి గతంలో మాదిరిగా అభ్యర్థులు పార్టీలు మారకుండా క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. దీంతో గతంలో మాదిరిగా.. స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.

అయితే, 2017 లో జరిగిన తప్పులను పునారావ్రుతం కాకుండా కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 2017 అసెంబ్లీ ఎన్నికలలో 40 స్థానాలున్న గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 21 మంది సంఖ్యా బలం ఉండాలి. అప్పుడు 17 సీట్లతో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధించింది.

బీజేపీకి కేవలం 13 సీట్లు మాత్రమే వచ్చాయి. అయినా బీజేపీ ఎంజీపీ, గోవా ఫార్వర్డ్ పార్టీ, స్వతంత్రులతో కలిసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు అలాంటి తప్పులు జరగకుండా కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

గోవాలో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వారితో టచ్ లో ఉన్నట్లు గోవా కాంగ్రెస్ ఇన్ చార్జ్ గుండురావు,చిదంబరం తెలిపారు. బీజేపీకి మధ్యతివ్వమని ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి అమిత్ పాలేకర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Published by:Paresh Inamdar
First published:

Tags: Assembly Election 2022, Goa Assembly Elections 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు