ఎన్నికల కౌంటింగ్ ముగిసిన వెంటనే నందిగ్రామ్‌లో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేత సువేందు అధికారి కారుపై కొందరు వ్యక్తులు రాళ్లదాడి చేశారు. గెలుపు అనంతరం సువేందు అధికారికి ఎన్నికల కార్యాలయానికి వెళ్లి సర్టిఫికెట్ తీసుకున్నారు. అనంతరం ఇంటికి వెళ్లుండగా కొందరు దుండగులు ఆయన్ను టార్గెట్ చేశారు. కారుపై రాళ్లు విసిరి రచ్చ రచ్చ చేశారు. సువేందుపై జరిగిన దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. తృణమూల్ గూండాలే ఈ దాడికి పాల్పడిందని మండిపడుతోంది.
West Bengal, Tamil Nadu, Kerala, Assam, Puducherry Asselmbly Results Updates: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. పశ్చిమ బెంగాల్ ప్రజలు మళ్లీ టీఎంసీకే అధికారం కట్టబెట్టారు. తృణమూల్ కాంగ్రెస్ మూడింట రెండొంతుల సీట్లు సాధించి..తమకు తిరుగులేదని తృణమూల్ కాంగ్రెస్ నిరూపించింది. నందిగ్రామ్‌లో తాను ఓడినప్పటికీ.. ఒంటి చేత్తో పార్టీని గెలిపించారు మమత. తమిళనాడులో అన్నాడీఎంకే కూటమి అధికారం కోల్పోయింది. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే బంపర్ విక్టరీ సాధించింది. కేరళలో ఎల్డీఎఫ్ చరిత్ర సృష్టించింది. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అసోం, పుదుచ్చేరిలో మాత్రం బీజేపీ వికసించింది.