Election Results 2021 Live Updates: బెంగాల్‌ టీఎంసీ దూకుడు.. తమిళనాడులో డీఎంకే విజయం

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2021 Live : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. పశ్చిమ బెంగాల్ ప్రజలు మళ్లీ టీఎంసీకే అధికారం కట్టబెట్టారు. తృణమూల్ కాంగ్రెస్ మూడింట రెండొంతుల సీట్లు సాధించి..తమకు తిరుగులేదని తృణమూల్ కాంగ్రెస్ నిరూపించింది. నందిగ్రామ్‌లో తాను ఓడినప్పటికీ.. ఒంటి చేత్తో పార్టీని గెలిపించారు మమత. తమిళనాడులో అన్నాడీఎంకే కూటమి అధికారం కోల్పోయింది. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే బంపర్ విక్టరీ సాధించింది. కేరళలో ఎల్డీఎఫ్ చరిత్ర సృష్టించింది. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అసోం, పుదుచ్చేరిలో మాత్రం బీజేపీ వికసించింది.

  • News18 Telugu
  • | May 02, 2021, 22:02 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED 5 MONTHS AGO

    AUTO-REFRESH

    Highlights

    21:52 (IST)

    నందిగ్రామ్‌ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని.. మమతాను ఓడించేందుకు కుట్ర జరిగిందని టీఎంసీ ఆరోపిస్తోంది. అక్కడ రీ కౌంటింగ్ నిర్వహించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది.
     

    21:51 (IST)

    ఎన్నికల కౌంటింగ్ ముగిసిన వెంటనే నందిగ్రామ్‌లో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేత సువేందు అధికారి కారుపై కొందరు వ్యక్తులు రాళ్లదాడి చేశారు. గెలుపు అనంతరం సువేందు అధికారికి ఎన్నికల కార్యాలయానికి వెళ్లి సర్టిఫికెట్ తీసుకున్నారు. అనంతరం ఇంటికి వెళ్లుండగా కొందరు దుండగులు ఆయన్ను టార్గెట్ చేశారు. కారుపై రాళ్లు విసిరి రచ్చ రచ్చ చేశారు. సువేందుపై జరిగిన దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. తృణమూల్ గూండాలే ఈ దాడికి పాల్పడిందని మండిపడుతోంది.
     

    19:44 (IST)

    తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించిన స్టాలిన్‌కు, కేరళలో గెలిచిన పినరయి విజయన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో బీజేపీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

    19:42 (IST)


    వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.  'పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలిచిన మమతా బెనర్జీకి అభినందనలు.  ప్రజల ఆకాంక్షలు నెరేవర్చడంతో పాటు కోవిడ్19పై జరుగుతున్న పోరాటంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం అండగా ఉంటుంది. అని ప్రధాని ట్వీట్ చేశారు.
     

    19:20 (IST)

    బెంగాల్ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో టీఎంసీ విజయం సాధించడంతో సీఎం మమతా బెనర్జీ సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలోనే కోల్‌కతాలోని కాళీ మాత ఆలయానికి వెళ్లి పూజలు చేశారు.


     

    19:19 (IST)

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన

    18:19 (IST)

    నందిగ్రామ్ ఫలితంలో బిగ్ ట్విస్ట్. మమతా బెనర్జీ గెలిచిందని మొదట వార్తలు రాగా అందులో నిజం లేదని తెలిసింది. నందిగ్రామ్‌లో తాను ఓడిపోయినట్లు మమతా బెనర్జీ ప్రకటించింది. నందిగ్రామ్ ఫలితాలను అందరూ గౌరవించాలని కార్యకర్తలకు సూచించింది.
     

    18:7 (IST)

    ఎల్డీఎఫ్‌ను గెలిపించినందుకు కేరళ ప్రజలకు సీఎం పినరయి విజయన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయాన్ని రాష్ట్రప్రజలకు అంకితమిస్తున్నట్లు చెప్పారు. ఐతే కరోనా విజృంభిస్తున్నందున విజయోత్సవ వేడుకలు చేసుకోకూడదని పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.


     

    18:4 (IST)

    ఎమ్మెల్యేగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుండి ధృవీకరణ పత్రం అందుకున్న నోముల భగత్


    West Bengal, Tamil Nadu, Kerala, Assam, Puducherry Asselmbly Results Updates: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. పశ్చిమ బెంగాల్ ప్రజలు మళ్లీ టీఎంసీకే అధికారం కట్టబెట్టారు. తృణమూల్ కాంగ్రెస్ మూడింట రెండొంతుల సీట్లు సాధించి..తమకు తిరుగులేదని తృణమూల్ కాంగ్రెస్ నిరూపించింది. నందిగ్రామ్‌లో తాను ఓడినప్పటికీ.. ఒంటి చేత్తో పార్టీని గెలిపించారు మమత. తమిళనాడులో అన్నాడీఎంకే కూటమి అధికారం కోల్పోయింది. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే బంపర్ విక్టరీ సాధించింది. కేరళలో ఎల్డీఎఫ్ చరిత్ర సృష్టించింది. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అసోం, పుదుచ్చేరిలో మాత్రం బీజేపీ వికసించింది.