Assembly Election Result 2018: సెమీ ఫైనల్స్‌లో విజేత ఎవరు?

Five States Assembly Election Result 2018 | తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. Telangana, Madhya Pradesh, Chhattisgarh, Mizoram and Rajasthan Election Results with News18 Telugu.

news18india
Updated: December 11, 2018, 6:57 AM IST
Assembly Election Result 2018: సెమీ ఫైనల్స్‌లో విజేత ఎవరు?
ప్రతీకాత్మక చిత్రం
news18india
Updated: December 11, 2018, 6:57 AM IST
2019 సార్వత్రిక ఎన్నిలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికలపై దేశమంతటా ఉత్కంఠ నెలకొంది. కొన్ని మాసాలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ ఐదు రాష్ట్రాల్లో ఓటరు తీర్పు మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. తెలంగాణలో కారు జోరు కొనసాగుతుందా? ప్రజా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందా? రాజస్థాన్‌, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని నిలుపుకుంటుందా? లేదంటే కమలం కంచుకోటలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా?  మిజోరంలో అధికారం చేపట్టబోయేది ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ మరికొద్ది గంటల్లో సమాధానం రాబోతోంది. ఇవాళ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది.

ఐదు రాష్ట్రాల్లోని 678 అసెంబ్లీ స్థానాల బరిలో నిలిచిన దాదాపు 8,500 మంది అభ్యర్థుల భవితవ్యం మధ్యాహ్నానికల్లా తేలనుంది.  దాదాపు 1.74 లక్షల ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటరు దేవుడి తీర్పు తేలనుంది.

ప్రతీకాత్మక చిత్రం


రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ద్విముఖ పోటీ నెలకొంది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలో ఉంది.   తెలంగాణలో కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కూటమిగా ఏర్పడి అధికార టీఆర్ఎస్‌తో తలపడ్డాయి. ఈశాన్య రాష్ట్రం మిజోరంలో కాంగ్రెస్‌, మిజోనేషనల్‌ ఫ్రంట్‌ తలపడ్డాయి. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా పరిగణిస్తున్నారు. దీంతో యావత్ దేశం దృష్టి ఈ ఫలితాలపై నెలకొంటోంది.



ప్రతీకాత్మక చిత్రం


బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు రాజస్థాన్‌లో కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతుండగా...ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో టఫ్ ఫైట్ ఉంటుందని జోస్యం చెబుతున్నాయి. మూడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనీసం రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచినా...వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి దేశ వ్యాప్తంగా ఆ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది.


ఇటు తెలంగాణలోనూ అధికార పగ్గాలను కైవసం చేసుకోవడం ద్వారా దేశ వ్యాప్తంగానూ బలం పుంజుకోవాలని కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని పలు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంచనావేస్తున్నాయి. లగడపాటి రాజగోపాల్ మాత్రమే ప్రజాకూటమి వైపే ఓటర్లు మొగ్గుచూపుతున్నట్లు తేల్చారు.
Loading...
ప్రతీకాత్మక చిత్రం


ఛత్తీస్‌గఢ్‌లో నవంబరు 12న తొలి విడత, నవంబరు 20న రెండో విడత ఎన్నికలు జరిగాయి. అనంతరం నవంబరు 28న మధ్యప్రదేశ్, మిజోరంలో పోలింగ్ జరిగింది. ఇక డిసెంబరు 7న తెలంగాణతో పాటు రాజస్థాన్‌లో ఎన్నికలు పూర్తయ్యాయి. రాజస్థాన్‌లో ఓ అభ్యర్థి మరణంతో ఒక  స్థానంలో ఎన్నికలు జరగలేదు. ఐదు రాష్ట్రాల్లో ఓటరు దేవుడి తీర్పు 1.74లక్షల ఈవీఎంలలో నిక్షిప్తమయ్యింది. ఇవాళ ఫలితాలు వెల్లడికానున్నాయి.

తెలంగాణతో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై న్యూస్18 తెలుగు(www.news18telugu.com) మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ అందిస్తుంది.
First published: December 11, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...