అసోంపై నాగ్‌పూర్ పెత్తనం కుదరదు : రాహుల్ గాంధీ

అసోం.. స్థానిక ప్రజల సారథ్యంలోనే నడుస్తుందని, నాగ్‌పూర్‌ నుంచి అసోంపై పెత్తనం చేయడం కుదరదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అసోం చరిత్ర,సంస్కృతిపై బీజేపీ,ఆర్ఎస్‌ఎస్‌ల దాడిని చూస్తూ ఊరుకోబోమన్నారు.

news18-telugu
Updated: December 28, 2019, 8:08 PM IST
అసోంపై నాగ్‌పూర్ పెత్తనం కుదరదు : రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ (File Photo)
  • Share this:
అసోం.. స్థానిక ప్రజల సారథ్యంలోనే నడుస్తుందని,అసోంపై నాగ్‌పూర్‌ పెత్తనం చేయడం కుదరదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అసోం చరిత్ర,సంస్కృతిపై బీజేపీ,ఆర్ఎస్‌ఎస్‌ల దాడిని చూస్తూ ఊరుకోబోమన్నారు. దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా.. ప్రభుత్వం ప్రజల గొంతుకను వినిపించుకోవడం లేదన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసోంలో జరుగుతున్న నిరసనలు మూడో వారానికి చేరుకున్న నేపథ్యంలో గువాహటిలో 'రాజ్యాంగ రక్షణ-భారత రక్షణ' పేరుతో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు.

బీజేపీ ఎక్కడికి వెళ్లినా విద్వేషాన్ని ప్రచారం చేస్తుందన్నారు రాహుల్. పౌరసత్వ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నవారిపైఎందుకు కాల్పులు జరుపుతున్నారని ప్రశ్నించారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ఉద్దేశం బీజేపీకి లేదని,ఈశాన్య రాష్ట్రల సంస్కృతి,చరిత్రను ప్రభుత్వం తుడిచిపెట్టాలనుకుంటోందని విమర్శించారు.First published: December 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు