అస్సాంలో ‘ఎన్ఆర్‌సీ’ చిచ్చు

news18-telugu
Updated: July 31, 2018, 8:59 AM IST
అస్సాంలో ‘ఎన్ఆర్‌సీ’ చిచ్చు
Villagers wait outside the National Register of Citizens (NRC) centre to get their documents verified by government officials, at Mayong Village in Morigaon district, in Assam, July 8, 2018. REUTERS/Stringer/Files
  • Share this:
అస్సాంలో జాతీయ పౌర గుర్తింపు తుది ముసాయిదా పలు వివాదాలకు కారణమైంది. సోమవారం కేంద్రం ప్రకటించిన తుది జాబితాలో మొత్తం 3.29 కోట్ల దరఖాస్తుల్లో 40.07 లక్షల మంది తమ అస్సామీ గుర్తింపు చూపించడంలో విఫలమయ్యారని కేంద్రం ప్రకటించింది. దీంతో తుది ముసాయిదాతో 40 లక్షల మందిపైగా ప్రజల భవితవ్యం అనిశ్చితిలో పడింది. గువాహటిలో సోమవారం భారత రిజిస్ట్రార్ జనరల్ శైలేజ్... సుప్రీమ్‌కోర్టు పర్యవేక్షణలో జరిగిన ఎస్సార్సీ ముసాయిదా వివరాలను వెల్లడించారు. భారత్,అస్సాంలో ఇది చరిత్రాత్మకమైన రోజు అని ఆయన పేర్కొన్నారు. తుది ముసాయిదా తర్వాత మిగిలిన వారికీ తమ అభ్యంతరాలను వెల్లడించే అవకాశం ఇస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేసారు. రిజిస్టర్‌లో పేరులేని 40లక్షల మందిపై ఎలాంటి చర్యలు ఉండబోవన్నారు. జాబితాలో పేరు లేని వాళ్లను నిర్భంధ కేంద్రాలకు పంపబోమని, విదేశీయలు నిర్ధారణ ట్రైబ్యునల్‌లకు వారి పేర్లను పంపబోమని స్పష్టం చేశారు.

అభ్యంతరాలను స్వీకరించే ప్రక్రియను ఆగష్టు30 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరగుతుంది.40 లక్షల మంది పేర్లను జాబితాలో ప్రచురించకపోవడంపై అస్పాం సమన్వయ కర్త ప్రతీక్ హజేలే మాట్లాడుతూ...మేం ఎంచుకున్న ప్రక్రియను బహిరంగ పరచలేమని చెప్పారు. ప్రజలు వారి అభిప్రాయాలను వెల్లడించేందుకు చాలినంత సమయం ముందని వెల్లడించారు. తుది జాబితాలో లేని వారి విషయంలో కేంద్రం ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సత్యేంద్ర గార్గ్ స్పష్టం చేశారు.

ఎస్సార్సీ జాబితా విడుదల సందర్భంగా అస్సాం ప్రజలకు ముఖ్యమంత్రి శర్భనంద్ సోనోవాల్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదో చరిత్రాత్మకమైన రోజు ఎప్పటికీ రాష్ట్ర ప్రజల స్మృతి పథంలో మిగిలిపోతుందని ప్రశంసించారు. జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందవద్దని వారి పౌరసత్వానికి సంబంధించిన అన్ని అవకాశాలను సమీక్షస్తామని సీఎం తెలిపారు. 1985లో అసోం వేర్పాటువాద ఉద్యమకారులతో జరిగిన ఒప్పందంలో భాగంగా అసోంలోకి బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను నిరోధించేందుకు 1951 నాటి జాతీయ పౌరుల రిజిస్టర్‌ను నవీకరించాలని కేంద్రం నిర్ణయించింది. అస్సాంలో వుంటున్న బెంగాలీలను, బిహారీలను వెళ్లగొట్టే కుట్రలో భాగమే ఎన్ఆర్‌సీ ముసాయిదా విడుదల చేసిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఎస్సార్సీ విడుదల సందర్భంగా విపక్షాలు సోమవారం రాజ్యసభను జరగనివ్వలేదు. ఎన్ఆర్‌సీని బీజేపీ ప్రభుత్వాలు అమలు చేసిన తీరు లక్షల మందిని అభద్రతా భావంలో పడేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 31, 2018, 8:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading