• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • ASSAM MLA RUPJYOTI KURMI RESIGNS TO CONGRESS PARTY SAYS NO CONFIDENCE IN RAHUL GANDHI SK

కాంగ్రెస్‌కు మరో షాక్.. ఎమ్మెల్యే రాజీనామా.. పార్టీ కోసం చేయి కోసుకున్నా.. ఐనా విలువ లేదు..

ప్రతీకాత్మక చిత్రం

రూప్‌జ్యోతి కుర్మి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి సీనియర్ నేత కాంగ్రెస్‌ను వీడడం ఇప్పుడు చర్చనీయాంశమయింది. త్వరలో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తారని ఆయన బాంబు పేల్చారు.

  • Share this:
    కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులున్నాయి. సీనియర్ నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. తాజాగా అసోంలోనూ కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది.  కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే రూప్‌జ్యోతి కుర్మి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జూన్ 24 లేదా 25న ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరియాని నియోజకవర్గం నుంచి  రూప్‌జ్యోతి కుర్మి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి సీనియర్ నేత కాంగ్రెస్‌ను వీడడం ఇప్పుడు చర్చనీయాంశమయింది. త్వరలో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తారని ఆయన బాంబు పేల్చారు. కాంగ్రెస్ హైకమాండ్ తీరు వల్లే తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని రూప్‌జ్యోతి కుర్మి స్పష్టం చేశారు.

    ''నేను అసోంలో టీ కమ్యూనిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేను. కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో మా కమ్యూనిటీలో ఎవరూ కాంగ్రెస్‌కు ఓటు వేయరు. ఆ పార్టీని ఇక ఎవరూ పట్టించుకోరు. కాంగ్రెస్ కోసం ఎంతో కష్టపడి పనిచేశాను. గతంలో ఓసారి చేయి కూడా కోసుకున్నా.  ఐనా వీటికి విలువ లేదు. అసోంలో ఏఐయూడీఎఫ్‌తో పొత్తుపెట్టుకొని రాహుల్ పెద్ద తప్పు చేశారు. మేం వ్యతిరేకించినా ఆయన వినలేదు. కొందరు సీనియర్లు మాత్రమే పార్టీని నడుపుతున్నారు.  యువ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. రాష్ట్రంలో అలానే ఉంది. కేంద్రంలోనే అదే పరిస్థితి. రాహుల్ గాంధీ నాయకత్వంపై నాకు నమ్మకం లేదు.'' అందుకే రాజీనామా చేశాను. అని రూప్‌జ్యోతి కుర్మి తెలిపారు.

    ఇటీవల యూపీలోనూ కాంగ్రెస్‌కు ఇదే తరహా అనుభవం ఎదురయింది. సీనియర్ నేత జితిన్ ప్రసాద ఇప్పటి ఆ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న క్రమంలోనే జితిన్ కాంగ్రెస్‌ను వీడడం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు రాజస్థాన్‌ కాంగ్రెస్‌లోనూ లుకలుకలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సచిన్ పైలట్ వర్గం ఏ క్షణమైనా కాంగ్రెస్‌కు హ్యాండిచ్చే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు కాంగ్రెస్ ఎమ్మె్ల్యేలు కూడా ఆయనకు మద్దతు ఇస్తున్నారని సమాచారం. వారంతా బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని సచిన్ పైలట్ స్పష్టం చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published: