అసోంలో పౌరుల తుది జాబిత విడుదల...19,06,657 మందికి దక్కని చోటు

గుహవటి అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. 200 కంపెనీల పారామిలటరీ బలగాల్ని మోహరించారు. విదేశీయుల గుర్తింపుపై ట్రైబ్యునల్‌లో తీర్పు వచ్చేవరకు ఎటువంటి చర్యలు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది.

news18-telugu
Updated: August 31, 2019, 11:04 AM IST
అసోంలో పౌరుల తుది జాబిత విడుదల...19,06,657 మందికి దక్కని చోటు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అసోంలో పౌరుల తుది జాబిత విడుదల చేసింది కేంద్రం. ఇందులో 19,06,657 మందికి చోటు దక్కలేదు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తుది జాబితాను విడుదల చేసింది. ఈ ఫైనల్ జాబితాలో 3,11,21,004 మందికి మాత్రమే చోటు లభించింది. దీంతో అసోంలో ప్రస్తుతం 144 సెక్షన్ నడుస్తోంది. గుహవటి అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. 200 కంపెనీల పారామిలటరీ బలగాల్ని మోహరించారు.

మరోవైపు జాబితాలో లేనివారి కోసం కేంద్రం ఉపశమన చర్యలు చేపట్టింది. జాబితాలో లేకపోయినా ఎవరినీ వెంటనే విదేశీయులుగా పరిగణించబోమని కేంద్రం ప్రకటించింది. విదేశీయుల గుర్తింపుపై ట్రైబ్యునల్‌లో తీర్పు వచ్చేవరకు ఎటువంటి చర్యలు ఉండవని స్పష్టం చేసింది. ఎవరినీ నిర్బంధించబోమంటూ హామీ ఇచ్చింది. ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలు, ఇతర సౌకర్యాలనుంచి ఎవరికీ మినహాయింపు ఉండదని పేర్కొంది. వారి పిల్లలకు విద్య, పౌరసత్వం తదితర అంశాల్లో ఎటువంటి ఆటంకాలూ ఉండవని ప్రకటించింది.
Published by: Sulthana Begum Shaik
First published: August 31, 2019, 10:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading