Home /News /politics /

ASSAM CM GIVES VIDEO PROOF OF SURGICAL STRIKE TO KCR AND HIMANTA ASKS TS CM WHY DESPERATE TO ATTACK ARMY MKS

Surgical strike ఆధారాలివిగో : ఆర్మీని బద్నాం చేసిన CM KCR: అస్సాం సీఎం దిమ్మతిరిగే కౌంటర్ Video

కేసీఆర్ కు హిమంత కౌంటర్

కేసీఆర్ కు హిమంత కౌంటర్

తెలంగాణ సీఎం కేసీఆర్ కు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ దిమ్మతిరిపోయే కౌంటరిచ్చారు. పాక్ ఆక్రమిత కశ్మీరులో భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన వీడియో‌ ఆధారాన్ని అస్సాం సీఎం విడుదల చేశారు.

యావత్ దేశం పుల్వామా అమరవీరులకు నివాళి అర్పిస్తున్న వేళ.. గతంలో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ అంశంపై రాజకీయ రచ్చ తారా స్థాయికి చేరింది. భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ ను బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుందని, అసలు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయో లేదో మోదీ సర్కార్ ఆధారాలను బయటపెట్టాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ దిమ్మతిరిపోయే కౌంటరిచ్చారు. పాక్ ఆక్రమిత కశ్మీరులో భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన వీడియో‌ ఆధారాన్ని అస్సాం సీఎం సోమవారం విడుదల చేశారు. ఈ సర్జికల్ స్ట్రైక్స్‌‌ను ప్రశ్నించిన కేసీఆర్, రాహుల్ గాంధీలపై హిమంత మండిపడ్డారు.

‘డియర్ కేసీఆర్ గారు.. ధైర్యసాహసాలుగల మన సైన్యం నిర్వహించిన లక్షిత దాడుల వీడియోగ్రాఫిక్ సాక్ష్యం ఇదిగో. ఇది ఉన్నప్పటికీ మీరు మన సాయుధ దళాల సత్తాను ప్రశ్నిస్తున్నారు, వారిని అవమానిస్తున్నారు. మన సైన్యాన్ని అపఖ్యాతిపాలు చేయడానికి, మన సైన్యంపై దాడి చేయడానికి మీకెందుకంత తెగింపు? మన సైన్యాన్ని అవమానించడాన్ని నవ భారతం సహించబోదు’అని హిమంత ట్వీట్ చేశారు. అస్సాం సీఎం బయలుపర్చిన వీడియోలో మ్యాపుల స్క్రీన్‌షాట్స్, ఉపగ్రహ ఛాయాచిత్రాలు, వివిధ వీడియోల్లోని కట్ షాట్స్ ఉన్నాయి.

CM KCR: కాంగ్రెస్‌తో పొత్తుపై కేసీఆర్ కుండబద్దలు -ఆ విషయంలో Rahul Gnadhiకి కడదాకా మద్దతు


కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పుట్టుకపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడం, వాటిని తెలంగాణ సీఎం కేసీఆర్ ఖండించిన దరిమిలా అస్సాం, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండటం తెలిసిందే. ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ సర్జికల్ స్ట్సైక్స్ పై ఆధారాలు కోరడంతో ‘రాహుల్.. రాజీవ్ గాంధీకే పుట్టాడని ఆధారాలు మనం అడుగుతామా?’అని బీజేపీ సీఎం హిమంత వ్యాఖ్యానించారు. అస్సాం సీఎం కామెంట్లపై పార్టీలకు అతీతంగా ఖండనలు వెలువడ్డాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రత్యర్థి అయినప్పటికీ గులాబీ బాస్ కేసీఆర్ అనూహ్యంగా రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించి, అస్సాం సీఎంపై ఆగ్రహం వెళ్లగక్కారు. ఆ క్రమంలోనే..

KCR National party: కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు కేసీఆర్ సై -Prashant Kishor సర్వేపైనా..


సర్జికల్ స్ట్సైక్స్ విషయంలో రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలు సమంజసమైనవేనని, ఆర్మీని బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని కేసీఆర్ మండిపడ్డారు. ఆదివారం నాటి ప్రెస్ మీట్ లో.. తాను కూడా సర్జికల్‌ స్ట్రయిక్స్‌పై ఆధారాలు చూపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు కేసీఆర్ అన్నారు. ‘తప్పకుండా ఇదో రాజకీయ జిమ్మిక్కు. ఇదో పెద్ద అనుమానం. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రజల్లో అనేక అనుమానాలున్నాయి. అంతేకాదు..


New Constitution : కొత్త రాజ్యాంగంపై CM KCR తాజా బాంబు.. దళిత సంఘాలకు సంబంధమేంటి?


సీడీఎస్ బిపిన్‌ రావత్‌ ప్రమాదంలో చనిపోతే ఉత్తరాఖండ్‌ ప్రచారంలో ఆయన ఫొటోతో బీజేపీ జెండాలతో ప్రచారం చేస్తున్నారు. వాట్‌ ఈజ్‌ దిస్‌ నాన్సెన్స్‌! బీజేపీ థర్డ్‌ క్లాస్‌ పార్టీ.. సరిహద్దులో ఆర్మీ పోరాడుతోంది. సైనికులు చనిపోతున్నారు. క్రెడిట్‌ కూడా ఆర్మీకే వెళ్లాలి. ఆర్మీకి మనమంతా సెల్యూట్‌ చేయాలి. బీజేపీకి ఎందుకు క్రెడిట్‌ వెళ్లాలి..’అని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ కామెంట్లకు ప్రతిగా అస్సాం సీఎం వీడియో ఆధారాన్ని విడుదల చేశారు. దీనిపై టీఎస్ సీఎం ప్రతిస్పందించాల్సిఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Rahul Gandhi, Surgical Strike 2, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు