Home /News /politics /

Rajasthan | రాజస్థాన్‌లో విశ్వాస పరీక్షలో నెగ్గిన అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం

Rajasthan | రాజస్థాన్‌లో విశ్వాస పరీక్షలో నెగ్గిన అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం

అశోక్ గెహ్లోత్, సచిన్ పైలెట్ కలిసిన వేళ (Image: @GovindDotasra)

అశోక్ గెహ్లోత్, సచిన్ పైలెట్ కలిసిన వేళ (Image: @GovindDotasra)

విశ్వాస తీర్మానంపై చర్చ అనంతరం ఈనెల 21వ తేదీకి సభ వాయిదా పడింది.

  రాజస్థాన్‌లో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం దానిపై నెగ్గింది. బీజేపీ అవిశ్వాసం పెట్టాలనుకున్న సమయంలో అనూహ్యంగా విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై చర్చించింది. శాసనసభ వ్యవహారాల మంత్రి శాంతి కుమార్ ధారివాల్ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అశోక్ గెహ్లోత్ బీజేపీకి గుణపాఠం చెప్పారు. గోవా, మధ్యప్రదేశ్ సీన్ ఇక్కడ పునరావృతం కానివ్వలేదు.’ అని అన్నారు. అలాగే, సాధారణంగా క్రిమినల్ పరిభాషలో ఉపయోగించే పదాలను కూడా ఆయన వాడారు. ఎవరి పేరు ప్రస్తావించకుండానే ఆయన ‘ప్రభుత్వాలను పడగొట్టడం ఇప్పుడొక మోడస్ అపరెండీ కాదు.. మోడీస్ అపరెండీ’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అశోక్ గెహ్లోత్ మాట్లాడుతూ బీజేపీ మీద మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని కూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో సంక్షోభాన్ని క్రియేట్ చేసి అదే సమయంలో బీజేపీ ముఖ్యమంత్రి కావడంతో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారని, దీని వల్ల మధ్యప్రదేశ్‌లో కరోనా ప్రబలిందని చెప్పారు. దేశంలో ఈడీ, సీబీఐ, ఆదాయ పన్ను శాఖలను దుర్వినియోగం చేశారని కేంద్రం మీద మండిపడ్డారు. ‘మీరు వారితో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు వారిని ఫేస్ టైమ్, వాట్సాప్ లో మాట్లాడాలని చెప్పలేదా?’ అని అశోక్ గెహ్లోత్ ప్రశ్నించారు.

  విశ్వాస తీర్మానంపై చర్చ అనంతరం ఈనెల 21వ తేదీకి సభ వాయిదా పడింది. ఇటీవల కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేసిన సచిన్ పైలెట్‌కు ఈ రోజు సభలో చివరి వరుసలో, ప్రతిపక్ష పార్టీల సభ్యులకు దగ్గర్లో సీటు కేటాయించారు. దీనిపై స్పందించిన సచిన్ పైలెట్ ‘ధైర్యవంతులను బోర్డర్‌కే పంపుతారు.’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే, తాము కాంగ్రెస్ పార్టీతో కలసి ఉన్నామని స్పష్టం చేశారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Ashok gehlot, Rajasthan, Sachin Pilot

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు