జగన్‌ను టార్గెట్ చేస్తున్న అసదుద్దీన్ ఓవైసీ ?

ఎన్‌పీఆర్‌పై జగన్మోహన్‌ రెడ్డి కోర్టులో స్టే తీసుకురావాలని అసదుద్దీన్ ఓవైసీ సూచించారు.

news18-telugu
Updated: February 19, 2020, 11:39 AM IST
జగన్‌ను టార్గెట్ చేస్తున్న అసదుద్దీన్ ఓవైసీ ?
అసదుద్దీన్ ఒవైసీ, జగన్
  • Share this:
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ టార్గెట్ చేస్తున్నారా ? విజయవాడలో జరిగిన సభలో అసదుద్దీన్ వ్యాఖ్యలకు అర్థమేంటి ? ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విజయవాడలోని కుమ్మరిపాలెం సెంటర్‌ ఈద్గా మైదానంలో పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన సభలో అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్‌పీఆర్‌పై జగన్మోహన్‌ రెడ్డి కోర్టులో స్టే తీసుకురావాలని సూచించారు. ఢిల్లీలో యూనివర్సిటీ విద్యార్ధులపై దాడులు జరుగుతున్నా, ముస్లిం యువతను కాల్చి చంపుతున్నా ప్రధాని నోరు మెదపడంలేదని అసదుద్దీన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం విద్రోహ చర్యలకు పాల్పడుతోందని, హక్కులు సాధించుకునేందుకు జైళ్లకు వెళ్లడానికైనా వెనుకాడే ప్రసక్తేలేదని ఆయన స్పష్టంచేశారు.

అయితే అసదుద్దీన్ వ్యాఖ్యలు పరోక్షంగా సీఎం జగన్‌ను టార్గెట్ చేసే విధంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. కొంతకాలంగా కేంద్రంతో సఖ్యతగా ఉంటున్న సీఎం జగన్... ఇప్పటికప్పుడు సీఏఏ విషయంలో కేంద్రం అభీష్టానానికి వ్యతిరేకంగా ముందుకు సాగే అవకాశాలు కనిపించడం లేదు. అయితే అసదుద్దీన్ మాత్రం ఈ విషయంలో సీఎం జగన్ తన వైఖరి స్పష్టం చేయాలని... దీనికి వ్యతిరేకంగా ముందుకు రావాలని డిమాండ్ చేశారు. అసదుద్దీన్ వ్యాఖ్యలకు టీడీపీ ఎంపీ కేశినేని నాని మద్దతు పలకడం మరో విశేషం.


First published: February 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు