• Home
 • »
 • News
 • »
 • politics
 • »
 • ASADUDDIN OWAISI AIMIM MLAS MEET BIHAR CM NITISH KUMAR THEY MAY QUIT MIM AND JOIN JDU SK

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఓవైసీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్న ఎంఐఎం ఎమ్మెల్యేలు?

అసదుద్దీన్ ఒవైసీ (File)

ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎల్జేపీ ఏకైక ఎమ్మెల్యే జేడీయూలో చేరతారని ఆ పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు. మంత్రివర్గ విస్తరణ ఆలస్యానికి ఇదే కారణమని చెప్పారు. ఇటీవలే బీఎస్పీ పార్టీ ఏకైక ఎమ్మెల్యే జమా ఖాన్ జేడీయూలో చేరారు.

 • Share this:
  ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఐదుగురు ఎమ్మెల్యేలు ఎంఐఎంకు గుడ్‌బై చెప్పాలని యోచిస్తున్నారట. ఐతే ఇది హైదరాబాద్‌లో కాదు. బీహార్‌లో..! ఎంఐఎం పార్టీకి చెందిన మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు గురువారం బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎల్జేపీ ఏకైక ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. బీహార్ జలవనరులశాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరి సమక్షంలో వీరంతా నితీష్ కుమార్‌తో చర్చలు జరిపారు. సుమారు 30 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. వీరంతా ఉన్నపళంగా సీఎం నితీష్‌తో సమావేశమవడం బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌‌గా మారింది. ఐదుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎల్జేపీ ఏకైక ఎమ్మెల్యే త్వరలోనే జేడీయూలో చేరతారని ప్రచారం జరుగుతోంది.

  ఐతే ఈ భేటీ వెనక రాజకీయ కారణాలులేవని మంత్రి విజయ్ కుమార్ తెలిపారు. సీమాంచల్‌లో ఉన్న సమస్యలపై చర్చించేందుకే వచ్చారని.. సీఎంను మర్యాదపూర్వకంగానే కలిశారని వెల్లడించారు. వారు జేడీయూలో చేరుతున్నారన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఎంఐఎం ఎమ్మెల్యే షానవాజ్ ఆలం సైతం పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించారు. సీఎంతో భేటీలో ఎలాంటి రాజకీయపరమైన అంశాలను చర్చించలేదని.. సీమాంచల్ అభివృద్ధిపైనే చర్చలు జరిగాయని తెలిపారు. నితీష్ కుమార్ అందరికీ సీఎం అని.. తమ ప్రాంత సమస్యల గురించి మాట్లాడేందుకే వెళ్లామని అన్నారు.
  mim winning seats in bihar, bihar mim mlas, bihar assembly elections, Bihar election results, bihar new governament,nda in bihar, nitish kumar, బీహార్‌లో ఎంఐఎం, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, నితీష్ కుమార్, బీజేపీ, జేడీయూ, ప్రధాని మోదీ,
  అసదుద్దీన్‌తో బీహార్ ఎంఐఎం ఎమ్మెల్యేలు (Image:ani)

  ఎల్జేపీ ఏకైక ఎమ్మెల్యే రాజ్‌కుమార్ సింగ్ కూడా సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. అంతేకాదు కొన్ని రోజుల క్రితం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అశోక్ చౌదరి నివాసానికి వెళ్లి కలిశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఐదుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలతో కలిసి నితీష్‌తో సమావేశం కావడం చర్చనీయాంశమయింది. ప్రస్తుతానికి పార్టీ మార్పు ప్రచారాన్ని వారు ఖండిస్తున్నప్పటికీ.. ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే వీరంతా జేడీయూలో చేరే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓ జేడీయూ నేత కూడా ఇదే అభిప్రాయాన్ని చెప్పారు. వారంతా జేడీయూలో చేరతారని.. మంత్రివర్గ విస్తరణ ఆలస్యానికి ఇదే కారణమని తెలిపారు. ఇటీవలే బీఎస్పీ పార్టీ ఏకైక ఎమ్మెల్యే జమా ఖాన్ జేడీయూలో చేరిన విషయం తెలిసిందే.

  కాగా, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీ పార్టీతో కలిసి పోటీచేసింది. ఐదు స్థానాల్లో ఓవైపీ పార్టీ గెలిచింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే సీమాంచల్‌లోనే ఎంఐఎం సత్తా చాటింది. ఆమోర్‌ నియోజకవర్గంలో అక్తరుల్ ఖాన్, బైసిలో సయ్యద్ రుక్నుద్దీన్ అహ్మద్, జోకిహాట్‌లో షానావాజ్ ఆలమ్, కోచధామమ్‌లో మహమ్మద్ ఇజార్ అఫ్సి, బహదూర్ గంజ్‌లో మహమ్మద్ అంజార్ నయీమీ విజయం సాధించారు. గెలుపు అనంతరం నవంబరులో ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు వచ్చి అసదుద్దీన్ ఓవైసీని కలిసి ధన్యవాదాలు తెలిపారు. కానీ అంతలోనే వీరు పార్టీ మారుతున్నారన్న ప్రచారం ఎంఐంఎకు మింగుడపడడంలేదు.
  Published by:Shiva Kumar Addula
  First published: