ముంబైకి వెళ్లనున్న అమిత్ షా.. శివసేనతో పంచాయితీ తేలుతుందా..?

అధికారం తాలూకు రిమోట్ శివసేన చేతుల్లోనే ఉంటుందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. సీఎం పదవిని చెరి రెండేళ్ల పంచుకునేలా బీజేపీ రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: October 27, 2019, 8:29 PM IST
ముంబైకి వెళ్లనున్న అమిత్ షా.. శివసేనతో పంచాయితీ తేలుతుందా..?
ఉద్ధవ్ థాక్రే, అమిత్ షా
  • Share this:
హర్యానా హంగ్ కథ సజావుగా పూర్తయింది. జేజేపీ మద్దతులో బీజేపీ మళ్లీ అధికారం పీఠమెక్కింది. ఐతే మహారాష్ట్ర పంచాయతీ మాత్రం ఇంకా ఎటూ తేలడం లేదు. ఎక్కువ సీట్లు వచ్చినందన తామే సీఎం పగ్గాలు చేపడతామని బీజేపీ స్పష్టంచేస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారమే సీఎం పదవిని పంచుకోవాల్సిందేని తెగేసి చెబుతోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర రాజకీయం ఎటూ తేలడం లేదు. అంతేకాదు అధికారం తాలూకు రిమోట్ శివసేన చేతుల్లోనే ఉంటుందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. సీఎం పదవిని చెరి రెండేళ్ల పంచుకునేలా బీజేపీ రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మరోవైపు అక్టోబరు 30న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీ వెళ్తున్నారు. అదే రోజు జరగనున్న బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఆయన కేవలం బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశానికి మాత్రమే పరిమితమవుతారా..? లేదంటే శివసేనతో కూడా చర్చలు జరుపుతారా? అన్నది తెలియాల్సి ఉంది. 50-50 ఫార్ములాను అమలు చేయాల్సిందేనని శివసేన పట్టబట్టుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రేతో అమిత్ షా చర్చలు జరిపే అవకాశముందని సమాచారం. మిత్రుల పంచాయితీ, ప్రభుత్వ ఏర్పాటుకి సంబంధించి అదే రోజు ఒక స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
First published: October 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>