జగన్ సర్కారుకు మరో తలనొప్పి.. ఇసుక సమస్య పరిష్కారం అయ్యేలోపే...

ఆంధ్రప్రదేశ్‌లో సిమెంట్ ధరలు అమాంతం పెరిగాయి. ఒక్కో సిమెంట్ బస్తాపై సుమారు 25 నుంచి 30 శాతం వరకు పెరిగినట్టు చెబుతున్నారు.

news18-telugu
Updated: November 10, 2019, 3:06 PM IST
జగన్ సర్కారుకు మరో తలనొప్పి.. ఇసుక సమస్య పరిష్కారం అయ్యేలోపే...
సీఎం జగన్
news18-telugu
Updated: November 10, 2019, 3:06 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరో తలనొప్పి ఎదురుకానుంది. ఇప్పటికే ఇసుక సమస్యతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఐదు నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో నదుల్లో వరదలు కొంచెం తగ్గడంతో ఇసుక తవ్వేందుకు ప్రభుత్వం పనులు ముమ్మరం చేసింది. అయితే, తాజాగా ఇసుక కార్మికుల మీద మరో దెబ్బ పడనుంది. మూడు రోజుల క్రితం వరకు మామూలుగానే ఉన్న సిమెంట్ ధరలు ఇప్పుడు అమాంతం పెరిగాయి. ఒక్కో సిమెంట్ బస్తాపై సుమారు 25 నుంచి 30 శాతం వరకు పెరిగినట్టు చెబుతున్నారు. ఇసుక లభ్యం కాగానే భవన నిర్మాణాలు ప్రారంభించాలనుకున్న రియల్టర్లకు, భవనాల యజమానులకు ఈ సిమెంట్ రేట్ల పెరుగుదల శరాఘాతంగా మారనుంది. ఒకవేళ సిమెంట్ ధరలకు భయపడి వారు నిర్మాణాలు నిలిపివేస్తే.. ఆ ప్రభావం భవన నిర్మాణ కార్మికుల మీదే పడనుంది.

ఇసుక కొరతపై విశాఖలో పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్


మూడు రోజుల క్రితం వరకు సిమెంట్ బస్తా రూ.250 నుంచి రూ.270 వరకు ఉండేది. అయితే, ప్రస్తుతం అవే సిమెంట్ బస్తా ధర రూ.380 వరకు చేరినట్టు చెబుతున్నారు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన సిమెంట్ ధరలన్నీ పెరిగినట్టు తెలిసింది. బ్రాండ్ లేని సిమెంట్ మాత్రమే బస్తా రూ.300 వరకు విక్రయిస్తున్నారు. ఇసుక కొరత కారణంగా సిమెంట్ కంపెనీలు కూడా 2-3 నెలలుగా ఉత్పత్తి నిలిపివేశాయి. ఇసుక తవ్వకాలు ప్రారంభం కానున్నాయని తెలిసిన వెంటనే ఉత్పత్తి ప్రారంభించాయి. అలాగే ధరలు కూడా పెంచేశాయి. పాత స్టాక్ కూడా పెంచిన రేట్ల ప్రకారమే అమ్మాలంటూ కంపెనీల నుంచి డీలర్లకు ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది.

Nara lokesh, ap sand policy, sand shortage in ap, nara lokesh protest against ap sand shortage, ap news, ap politics, నారా లోకేశ్, ఇసుక కొరత, టీడీపీ, వైసీపీ, ఏపీ న్యూస్
ఏపీలో ఇసుక కొరతపై గుంటూరులో ఒక్క రోజు దీక్ష చేసిన నారా లోకేష్
మరోవైపు ఇసుక ధరలు కూడా ఆకాశాన్ని తాకకనున్నాయి. ఇసుక కొరతకారణంగా సగంలో నిలిచిపోయిన నిర్మాణాలను త్వరత్వరగా పూర్తి చేసుకునేందుకు రియల్టర్లు, భవనాల యజమానులు ప్రారంభిస్తారు. ఈ క్రమంలో ఇసుక ధరలు కూడా పెరిగాయి. ట్రాక్టర్ ఇసుక రెండు మూడు నెలల క్రితం రూ.2500 నుంచి రూ.3000 వరకు ఉండేది. అయితే, తాజాగా ట్రాక్టర్ ఇసుక లోడ్ ధర గుంటూరులో రూ.8000 పలికింది. ఇసుక ధరలను నియంత్రించాలని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.
First published: November 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...