ఢిల్లీలో కేసీఆర్‌కు షాక్... మీడియా అడిగిన ప్రశ్నలకు సీఎం సైలెంట్

ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ముఖ్యమంత్రి స్పందించాన్ని నేషనల్ మీడియా మండిపడింది.

news18-telugu
Updated: December 3, 2019, 12:27 PM IST
ఢిల్లీలో కేసీఆర్‌కు షాక్... మీడియా అడిగిన ప్రశ్నలకు సీఎం సైలెంట్
సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఎప్పుడూ లేని విధంగా ఢిల్లీలో సీఎం కేసీఆర్‌కు విచిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ప్రధాని, కేంద్రమంత్రులతో కలిసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తిన వెళ్లారు. అక్కడ అధికారిక కార్యక్రమాలతో పాటు... ఓ నాయకుడి ఇంట పెళ్లికి కూడా హాజరయ్యారు. రెండు రోజుల నుంచి ఆయన అక్కడే ఉన్నారు. అయితే... కేసీఆర్‌పై నేషనల్ మీడియా మండిపడుతోంది. దిశా హత్యాచార ఘటనపై సీఎం స్పందించిన తీరుపై ఇప్పటికే పలు ఆరోపణలు వినిపంచాయి. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ముఖ్యమంత్రి స్పందించాన్ని నేషనల్ మీడియా మండిపడింది. తాజాగా ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్‌కు ఇదే విషయమై నేషనల్ మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఢిల్లీలో పెళ్లికి వచ్చిన మీకు.. దిశా ఇంటికి పరామర్శకు వెళ్లే టైం లేదా అని ప్రశ్నించారు. దీంతో మీడియా అడిగిన ప్రశ్నలకు ఖంగు తిన్న కేసీఆర్ అక్కడ నుంచ ఏమాట్లాడకుండానే సైలెంట్‌గా వెళ్లిపోయారు.

తెలంగాణలో దిశా హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దేశరాజధాని ఢిల్లీలో సైతం నిరసనలు మిన్నంటాయి. నేషనల్ మీడియా సైతం దీనిపై గళమెత్తింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ ఘటనపై చర్చించారు. దిశ కుటుంబానికి న్యాయం జరగాలని పార్టీలకు అతీతంగా అందరూ మాట్లాడారు.

First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>