• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AS JAGGAREDDY CONCRATE ON PPC RACE HIS OWN CADRE JOINING TRS IN SANGAREDDY BA MDK

Jagga Reddy: సంగారెడ్డిలో జగ్గారెడ్డికి షాక్.. పెద్ద పదవి కోసం హైదరాబాద్‌లో ఉంటే.. అక్కడ సంగారెడ్డిలో..

Jagga Reddy: సంగారెడ్డిలో జగ్గారెడ్డికి షాక్.. పెద్ద పదవి కోసం హైదరాబాద్‌లో ఉంటే.. అక్కడ సంగారెడ్డిలో..

జగ్గారెడ్డి (File- credit - twitter)

2018 ఎన్నికలలో అధికార పార్టీ పై 4250 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించారు జగ్గారెడ్డి. సంగారెడ్డి అభివృద్ధి కోసం మెడికల్ కాలేజ్ కోసం సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్తున్న జగ్గారెడ్డి ఇప్పుడు హైదరాబాద్ కు పరిమితం అవుతున్నారు.

  • Share this:
    సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బలంగా వినిపించేది జగ్గారెడ్డి. ఆయనంటే యువతతో పాటు కాంగ్రెస్లో అభిమానులు భారీ సంఖ్యలో ముందుకు వచ్చేవారు. అయితే, నమ్ముకుని వచ్చిన వారి కోసం కనీసం అందుబాటులో లేకుండా పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తనను నమ్ముకుని వచ్చి వారి ఫోన్ కూడా లేపకుండా హైదరాబాద్ గాంధీభవన్‌కు అంకితమై పోయారంటూ జగ్గారెడ్డి మీద విమర్శలు వస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లూ ఆయన్ను అంటిపెట్టుకుని ఉన్న కార్యకర్తలు ఇప్పుడు దూరం అవుతున్నారు.

    ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలలో అధికార పార్టీ టీఆర్ఎస్ 9 సీట్లు గెలవగా అందులో సంగారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ గెలిచింది. జగ్గారెడ్డి గెలుపుతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బలంగా ఉంది అనుకున్నారు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన హైదరాబాద్ కు అంకితం అయ్యారు. పీసీసీ రేస్ లో నేను కూడా ఉన్నానంటూ అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అయితే, ఆయన హైదరాబాద్ లో బిజీగా ఉంటే, సంగారెడ్డిలో కాంగ్రెస్ కార్యకర్తలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతూ పార్టీలో చేరుతున్నారు.

    సంగారెడ్డి నియోజక వర్గం నుంచి మొదట టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన జగ్గారెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ తీర్థం తీసుకున్నారు. అప్పటినుండి కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో వ్యతిరేకంగా ఉన్నారు. అప్పట్లో ప్రభుత్వ విప్ గా ఉన్న జగ్గారెడ్డి సర్వసభ్య సమావేశాలకు వచ్చిన ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ చార్జి మంత్రి దానం నాగేందర్‌ను అడ్డుకుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యనారాయణ పై చేయి చేసుకున్నారు.

    2018 ఎన్నికలలో అధికార పార్టీ పై 4250 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించారు జగ్గారెడ్డి. సంగారెడ్డి అభివృద్ధి కోసం మెడికల్ కాలేజ్ కోసం సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్తున్న జగ్గారెడ్డి ఇప్పుడు హైదరాబాద్ కు పరిమితం అవుతున్నారు. సంగారెడ్డి ప్రజలతో పాటు కార్యకర్తలకు దూరమవుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. ఇటీవల ఆయన ముఖ్య అనుచరులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టి టీఆర్ఎస్ పార్టీలో చేరడమే అందుకు నిదర్శనం అంటున్నారు. పీసీసీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తుంటే.. గ్రౌండ్ లో కేడర్‌ను నిలబెట్టుకోలేకపోతున్నారని చెబుతున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు